ఎమ్మా వాట్సన్ (Emma Watson). హ్యారీ పాటర్ మూవీలో హీరోయిన్గా అందరికి సుపరిచితం. తాజాగా ఈమే ఇన్స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పోస్టులో ఆమె చిప్కో ఉద్యమం చేసిన వారందరికీ థ్యాక్స్ చెప్పింది. ”మా అడవులు మరియు చెట్లను రక్షించినందుకు ధన్యవాదాలు!” అంటూ ఈ పోస్టు చేసింది. ఈ పోస్టు ఇప్పుడు నెట్లో వైరల్‌గా మారింది. ఆమె ఇన్స్టాగ్రామ్ (Instagram)లో “ఇక్కడ చూస్తున్న ఫోటోలో మహిళలు చిప్కో ఉద్యమంలో భాగంగా ఉన్నారు, ఇది 1970లలో భారతదేశంలోని గ్రామీణ గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అహింసాయుత సామాజిక మరియు పర్యావరణ ఘట్టం. ఇక్కడ వారు ప్రభుత్వ లాకింగ్ నుంచి చెట్టును రక్షిస్తున్నారు. చిప్కో (Chipko movement:) అనే హిందీ పదానికి "కౌగిలించుకోవడం" లేదా "పెనవేసుకోవడం" అని అర్ధం, ఇది చెట్లను లాగర్ల నుంచి రక్షించడానికి చెట్లను ఆలింగనం చేసుకొని రక్షించడంలో ప్రాథమిక వ్యూహం అంటూ. .పోస్టు చేశారు.
View this post on Instagram
ఏమిటీ చిప్కో ఉద్యమం..
ప్రముఖ పర్యా వరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్‌లాల్ బహుగుణ (Sundarlal Bahuguna)ఈ ఉద్యమాన్నిప్రారంభించారు. హిమాలయ ప్రాం తాల్లో అడవుల నరికివేతను వ్య తిరేకిస్తూ సుందర్‌లాల్ బహుగుణ ఎన్నో ఉద్య మాలు చేశారు. పర్యా వరణ ప్రాముఖ్య త అం దరికీ అర్థమయ్యే రీతిలో 1970ల్లో ప్రారం భిం చిన చిప్కో
ఉద్య మానికి నేతృ త్వం వహిం చారు.
దీం తో ప్రపం చం దృ ష్టిని ఆకర్షిం చారు. ఈ ఉద్యమంలో చెట్లను రక్షించడానికి ఆయన అహింసా మార్గాన్ని అనుసరించారు.
ఎవరైన చెట్లను నరకడానికి వస్తే ఆ ప్రాంతంలో ఉన్న పల్లె వాసులు మహిళలు ఆచెట్టును కౌగిలించుకొంటారు. ఎవ్వరూ ఆ చెట్టను నరకకుండా అహింసాయుతంగా అడ్డుకొంటారు. ఈ ఉద్యమం ఎందరో పర్యవరణవేత్తకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఉద్యమ ఫలితంగా ప్రభుత్వాలు చెట్ట నరికివేతపై ఆంక్షలు విధించింది.
త్వరలో హ్యారీ పోటర్ రీయూనియన్ స్పెషల్
హ్యారీపాటర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సొంత చేసుకొంది ఎమ్మా వాట్సన్. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్ త్వరలో HBO మ్యాక్స్‌లో రాబోయే హ్యారీ పోటర్ రీయూనియన్ స్పెషల్‌లో డేనియల్ రాడ్‌క్లిఫ్ మరియు రూపర్ట్ గ్రింట్ వంటి ఫ్రాంచైజీలోని తన తోటి నటులతో కలిసి కనిపించనుంది. ఇది జనవరి 1న HBO Maxలో ప్రసారం అవుతుంది. ఈ రిటర్న్ ఆఫ్ హాగ్వర్డ్ లో హెలెనా బోన్హామ్ కార్టర్, రాబీ కోల్ట్రేన్, రాల్ఫ్ ఫియన్నెస్, జాసన్ ఐజాక్స్, గ్యారీ ఓల్డ్మన్, టామ్ ఫెల్టన్, జేమ్స్ ఫెల్ప్స్, ఆలివర్ ఫెల్ప్స్, మార్క్ విలియమ్స్, బోనీ రైట్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్, మాథ్యూ లూయిస్ మరియు ఇవన్నా లించ్ కూడా కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.