లాడెన్ కొడుకు హంజాబిన్‌ను మట్టుబెట్టిన అమెరికా..

హంజాబిన్ చివరిసారిగా 2018లో మీడియాకు విడుదల చేసిన వీడియోలో సౌదీఅరేబియాను హెచ్చరించాడు.2017లో హంజాబిన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా.. రెండేళ్లుగా అతని కోసం తీవ్రంగా గాలిస్తోంది.

news18-telugu
Updated: August 1, 2019, 7:52 AM IST
లాడెన్ కొడుకు హంజాబిన్‌ను మట్టుబెట్టిన అమెరికా..
హంజాబిన్ లాడెన్(File)
  • Share this:
అల్‌ఖైదా అధినేత ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్‌లాడెన్‌ను మట్టుబెట్టినట్టు అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎప్పుడు.. ఎక్కడ అతన్ని మట్టుబెట్టారన్న విషయాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. హంజా బిన్ లాడెన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా 1మిలియన్ డాలర్ రివార్డు ప్రకటించింది. లాడెన్ చనిపోయిన తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన హంజాబిన్ చివరిసారిగా 2018లో మీడియాకు విడుదల చేసిన వీడియోలో సౌదీఅరేబియాను హెచ్చరించాడు.2017లో హంజాబిన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా.. రెండేళ్లుగా అతని కోసం తీవ్రంగా గాలిస్తోంది.హంజాబిన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి.. ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టింది. అతని ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టింది. కాగా, ఒసామాబిన్ లాడెన్ 20మంది పిల్లల్లో హంజాబిన్ 15వ వాడు. అబోత్తబాద్‌లోని లాడెన్‌ ఇంట్లో అమెరికా అతన్ని మట్టుబెట్టిన సమయంలో హంజాబిన్ తప్పించుకున్నాడు. అప్పటినుంచి అమెరికాకు చిక్కకుండా అల్‌ఖైదా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతను ఎట్టకేలకు హతమయ్యాడు. అయితే అతని మృతిని అమెరికా వైట్ హౌజ్ వర్గాలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.

First published: August 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు