Video : నిమ్మకాయపై మేకులతో కొడితే ఏమవుతుందో తెలుసా?

నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది మాత్రమే కాదు... దానితో ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి అంటూ ఓ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 11:23 AM IST
Video : నిమ్మకాయపై మేకులతో కొడితే ఏమవుతుందో తెలుసా?
నిమ్మకాయపై మేకులతో ట్రిక్ (Image : Youtube - NorthSurvival)
Krishna Kumar N | news18-telugu
Updated: August 10, 2019, 11:23 AM IST
ఈ భూమిపై ఉన్న పండ్లలో మనకు బాగా ఉపయోగపడేవాటిలో నిమ్మకాయ ఒకటి. జ్యూస్‌గా, క్లీనింగ్ లిక్విడ్‌గా, ఒత్తిడిని తగ్గించేందుకూ ఇలా ఎన్నో రకాలుగా నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. వాంతులు వస్తున్నా, వికారంగా ఉన్నా... నిమ్మకాయ వాసన చూస్తే చాలు... వామ్టింగ్స్ ఆగిపోతాయి. ప్రయాణాలు పడనివారు... తమతో నిమ్మకాయ తీసుకెళ్లి... వాసన చూస్తూ ఉంటే... కడుపులో తిప్పే సమస్య తీరుతుంది. ఇవన్నీ మనం రెగ్యులర్‌గా చెప్పుకునే విషయాలే. ఐతే... నిమ్మకాయతో నిప్పు రాజేయవచ్చని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు... క్యాంప్ ఫైర్ వేసుకోవాలంటే... ముందు నిప్పు రాజేయాలి. అందుకోసం గ్యాస్ లైటరో, అగ్గి పెట్టో అవసరం లేదంటున్న ఆ యువకుడు... నిమ్మకాయ, కొన్ని మేకులూ, వైర్లూ ఉంటే చాలంటున్నాడు. అదెలాగో వీడియోలో మీరే చూడండి.

ఈ వీడియో చూసిన ఎవరికైనా... మేకులకూ, నిమ్మకాయకూ ఏంటి సంబంధం? నిమ్మకాయలో మేకులు కొట్టడం వల్ల మంట ఎలా వస్తుంది అన్న డౌట్ రావడం సహజం. దీనికి కారణం రసాయనకి చర్యే. నిమ్మకాయలో ఉండే యాసిడ్, మేకుల్లో ఉండే లోహాలతో కనెక్ట్ అవుతుంది. ఫలితంగా కరెంటు షాక్ సమయంలో ఎలాగైతే కరెంటు వస్తుందో, అలా ఫైర్ వస్తుందని అంటున్నాడు ఆ యువకుడు.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...