HAITI PLANE CRASH SIX DIE IN CRASH OF PRIVATE AIRPLANE IN HAITI SK
Haiti Plane crash: హైతిలో కుప్పకూలిన విమానం.. ఆరుగురు దుర్మరణం
ప్రతీకాత్మక చిత్రం
హైతి రాజధాని పోర్టో ప్రిన్స్ నుంచి నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గాలు సాయుధుల నియంత్రణలోకి వెళ్లాయి. భారీ మొత్తంలో ఆయుధాలు కలిగిన వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో చార్టర్ ఫ్లైట్స్‌కు డిమాండ్ పెరిగింది
కరీబియన్ దేశం హైతిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శనివారం దేశ రాజధాని పోర్టో ప్రిన్స్‌కు దక్షిణ ప్రాంతంలో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. శుక్రవారం సాయంత్రం పోర్టో ప్రిన్స్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేట్ జెట్ బయలుదేరింది. హైతి దక్షిణ తీరంలో ఉన్న జాక్మెల్ నగరానికి ఆ విమానం చేరుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే ఘోరం జరిగింది. విమానం కూలిపోవడంతో అందులో ఉన్న వారంతా మరణించారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి వెళ్లాయి. అప్పటికే ప్రయాణికులు చనిపోయారు. టేకాఫ్ అయిన గంట సమయానికి విమానం కూలిపోయినట్లు నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆఫీష్ (NCAO) తెలిపింది. 'ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ జెట్ కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ చనిపోయారు.' అని హైతి ఔస్ట్ డిపార్ట్మెంట్ సివిల్ ప్రొటెక్షన్ కోఆర్డినేటర్ గూటెన్‌బర్గ్ డెస్టిన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
హైతి రాజధాని పోర్టో ప్రిన్స్ నుంచి నుంచి దక్షిణ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గాలు సాయుధుల నియంత్రణలోకి వెళ్లాయి. భారీ మొత్తంలో ఆయుధాలు కలిగిన వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్తున్నారు. వాటిలో విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో చార్టర్ ఫ్లైట్స్‌కు డిమాండ్ పెరిగింది. చాలా మంది సంపన్నులు ప్రైవేట్ జెట్స్‌లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోర్టో ప్రిన్స్ శివారులో విమాన ప్రమాదం జరిగింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.