పాకిస్థాన్ వంకర బుద్ధి...కరోనా పేరుతో ఉగ్రవాది హఫీజ్ సయీద్ జైలు నుంచి విడుదల...

పాకిస్థాన్ జైలులో 50 మందికి కరోనా సోకింది అనే సాకుతో హఫీజ్ సయీద్ ను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.

news18-telugu
Updated: May 5, 2020, 12:34 AM IST
పాకిస్థాన్ వంకర బుద్ధి...కరోనా పేరుతో ఉగ్రవాది హఫీజ్ సయీద్ జైలు నుంచి విడుదల...
హఫీజ్ సయ్యిద్. (ఫైల్ ఫోటో)
  • Share this:
ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్‌, హఫీజ్‌ సయీద్‌ను పాక్‌ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. పాకిస్థాన్ జైలులో 50 మందికి కరోనా సోకింది అనే సాకుతో హఫీజ్ సయీద్ ను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ కోర్టు అతడికి 11ఏళ్ల జైలు శిక్షను విధించింది. అమెరికా ఒత్తిడితో భద్రతా మండలి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ తర్వాత ముంబై ఉగ్రదాడి కేసుతో పాటు, భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు తదితర కేసులకు సంబంధించి సయీద్‌ను తమకు అప్పగించాలని భారత్‌ కోరుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌ఏటీఎఫ్‌ జాబితాలో పాక్‌కు చెందిన 7,600 మంది ఉగ్రవాదులు ఉండగా, కరోనా పరిస్థితిని అనుకూలంగా మలచుకొని పాకిస్థాన్. 1,800 మందిని ఆ జాబితా నుంచి తొలగించిందని అమెరికన్ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే హఫీజ్ సయీద్ తోపాటు ముంబై పేలుళ్ల మరో సూత్రధారి జకీ-ఉర్‌-రెహ్మాన్‌ లఖ్వీ కూడా ఉన్నాడు.
First published: May 5, 2020, 12:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading