Big Family: అతనికి 27 మంది భార్యలు, 150 మంది సంతానం.. అందులో 67వ వ్యక్తి మాత్రం ప్రత్యేకం.. ఎందుకంటే..

(Image Credit: Tiktok/@kayezer0)

ప్రస్తుతం విన్‌స్టన్ కుటుంబం బ్రిటీష్ కొలంబియాలోని బౌంటీఫుల్లో నివసిస్తోంది. అతడి 67వ కుమారుడైన ముర్రే బ్లాక్ మోర్ తన భారీ కుటుం?

  • Share this:
మహాభారతంలో ధ్రుతరాష్ట్రుని సంతానం నూరుగురు అనే విషయం అందరికి తెలిసిందే. వారి పుట్టుకకు పురాణ గాధ వేరే ఉన్నప్పటికీ 100 మంది పేర్లను గుర్తుంచుకోవడం మాత్రం సామాన్యమైన విషయం కాదు. అది ద్వాపర యుగం కాబట్టి సరిపోయింది కానీ.. ప్రస్తుత తరంలో ఇలాంటి కుటుంబం ఉంటుందా అనే సందేహం రావచ్చు. అయితే అంతకు మించి సంతానం ఉన్న వ్యక్తి ఒకరు కెనడాలో ఉన్నారు. ఆయన పేరు విన్‌స్టన్ బ్లాక్‌మోర్. ఆయనకు 27 మంది భార్యలు ఉన్నారు. మొత్తం 150 మంది సంతానం. ఈయన 67వ కుమారుడు ముర్రే బ్లాక్ మోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతడికి తన 149 మంది తోబుట్టువుల్లో ప్రతి ఒక్కరి పేరు గుర్తుందట. అంతేకాకుండా వారి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిట్కాను అనుసరిస్తానని చెబుతున్నాడు ముర్రే.

వీడియోల ద్వారా వివరణ..
ప్రస్తుతం విన్‌స్టన్ కుటుంబం బ్రిటీష్ కొలంబియాలోని బౌంటీఫుల్లో నివసిస్తోంది. అతడి 67వ కుమారుడైన ముర్రే బ్లాక్ మోర్ తన భారీ కుటుంబం గురించి ఎప్పటికప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆసక్తి కరమైన విషయాలను తెలియజేస్తుంటాడు. ఈ వీడియోల ద్వారా తన తోబుట్టువుల గురించి వివరిస్తుంటారు. ఓ వీడియోలో తన తల్లిదండ్రులు తెలివిగా తమ పిల్లలకు ఎలా పేరు పెట్టారో వివరించాడు. తద్వారా వారందరినీ ఎలా గుర్తుంచుకున్నానో తెలిపాడు. ఒకే ఏడాదిలో పుట్టిన పిల్లలందరికీ ఒకే అక్షరం కలిసి వచ్చేలా పేర్లు పెట్టారని ముర్రే వివరించాడు.

ఉదాహరణకు.. తను జన్మించిన సంవత్సరం 2001లో పుట్టినవారందరికీ ఆంగ్ల అక్షరం 'M' తో ప్రారంభమయ్యేలా పేర్లు పెట్టారని ముర్రె తెలిపాడు. "నాతో కలిపి 2001లో మొత్తం 12 మంది జన్మించాం. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, తొమ్మిది మంది అమ్మాయిలు ఉన్నారు" అని స్పష్టం చేశాడు. వేర్వేరు వయస్సుల వారికి వేర్వేరు అక్షరాలు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే అవును అని తెలిపాడు. N, R, A, O, J.. తదితర అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నాయంటూ తన కుటుంబం గురించి వివరించాడు. అంతేకాకుండా తన సోదర, సోదరీమణుల పేర్లన్నీ తనకు తెలుసని, అయితే ఇందుకు తన మెదడుకు పెద్దగా పని పెట్టలేదని స్పష్టం చేశాడు.

ముర్రే తన సోదరులతో బంధాన్ని గురించి వివరించాడు. ‘నేను నా తోబుట్టువులతో సన్నిహితంగా ఉన్నానా అని అడిగితే చెప్పలేను. ఎందుకంటే మా కుటుంబం ఓ పాఠశాలలా ఉంటుంది. మేము ప్రతి ఒక్కరం ఒకరికొకరు తెలుసు. నేను కొంతమందితో మాత్రమే క్లోజ్‌గా ఉంటాను. వారిలో కొంతమందిని తల్లిదండ్రులుగా భావిస్తాను" అని తెలిపాడు. ముర్రే తల్లికి 10 మంది సంతానం. అంటే అతడికి 9 మంది సొంత తోబుట్టువులు ఉన్నారు. మొత్తం తోబుట్టువుల్లో అందరికంటే పెద్ద వ్యక్తికి 44 ఏళ్లని, చిన్నవాడికి ఏడాది వయసు ఉంటుందని ముర్రే తెలిపారు. అంతేకాకుండా కుటుంబ వృద్ధిని ఆపేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక వేసుకోలేదని చెప్పాడు. త్వరలో ఇంకొకరు తమ కుటుంబంలోకి రాబోతున్నారని వివరించాడు. అయితే తన తండ్రికి ఇదే చివరి సంతానమా అంటే.. చెప్పలేనని ముర్రే బదులివ్వడం గమనార్హం.
Published by:Sumanth Kanukula
First published: