• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • GUINNESS WORLD RECORD THIS 12 YEAR OLD USA BOY GETS PLACE IN BOOK OF GUINNESS WORLD RECORDS FOR BUILDING TALLEST POPSICLE STRUCTURE NK GH

Guinness record: ఐస్‌క్రీమ్ పుల్లలతో ఎత్తైన టవర్‌... గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు

Guinness record: ఐస్‌క్రీమ్ పుల్లలతో ఎత్తైన టవర్‌... గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు

ఐస్‌క్రీమ్ పుల్లలతో ఎత్తైన టవర్‌... గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు (Credit: Guinness World Records/Twitter)

Guinness record: ఇలాంటి గిన్నీస్ రికార్డ్ ఒకటి ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. సరే... ఆ పిల్లాడికి ఎలా తెలిసిందో తెలిసింది. దాన్ని సాధించాడు. ఎలాగో మనం తెలుసుకుందాం.

  • Share this:
Guinness record: వృథాగా పారేసే వస్తువులతో ఆకట్టుకునే కళాఖండాలు చేస్తున్నాడు ఈ అమెరికా పిల్లాడు. మనసుంటే కళకు మార్గం ఉంటుందని నిరూపిస్తున్నాడు. 12 ఏళ్ల ఎరిక్ క్లాబెల్ తన ప్రత్యేకమైన టాలెంట్‌తో గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత మిగిలే పుల్లలతో (popsicle sticks) అద్భుతం చేశాడు. వాటిని ఉపయోగించి ఓ టవర్‌ నిర్మించాడు. ఫలితంగా ఇలాంటి వస్తువులతో ఎత్తయిన టవర్‌ను నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నెపర్వీల్లేకు చెందిన ఎరిక్ క్లాబెల్ ఐసు పుల్లలను ఉపయోగించి ఏకంగా 6.157 మీటర్ల (20.2 అడుగులు) ఎత్తయిన టవర్‌ను నిర్మించాడు. దాదాపు నెల రోజుల పాటు దీని కోసం శ్రమించాడు. ఈ నిర్మాణంలో మొత్తం 1750 ఐసు పుల్లలను, రెండు పౌండ్ల (దాదాపు కేజీ) బరువుండే గమ్‌ను వాడటం విశేషం.

తండ్రే మార్గదర్శకత్వం:
క్లాబెల్ తండ్రి కూడా ఐసు పుల్లలతో ఇలాంటి నిర్మాణాలు రూపొందించేవాడు. దీంతో వీటిపై పిల్లాడికి ఆసక్తి ఏర్పడింది. దీంతో 2015 నుంచి ఐసు పుల్లలు, రీసైక్లింగ్ మెటీరియల్స్‌తో వస్తువులను నిర్మించడం ప్రారంభించాడు క్లాబెల్. ఓసారి తను గిన్నిస్ రికార్డు హోల్డర్లకు సంబంధించిన వీడియో చూసి ప్రేరణ పొందాడు. ఎప్పటికైనా తాను కూడా ఆ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవాలని భావించాడు. తన అభిరుచి ప్రకారం ఐసు పుల్లల శిల్పకళపై నైపుణ్యం సాధించాడు. తక్కువ కాలంలోనే రికార్డ్ బ్రేకింగ్ ఐస్ లాలీ (Ice lolly) స్ట్రక్చర్‌ను నిర్మించాడు. ఈ కుర్రాడు టవర్‌ను నిర్మించడం కోసం ఎంతో కష్టపడ్డాడనీ, ముఖ్యంగా అది బలంగా ఉండేందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అభిప్రాయపడింది. చివరకు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగాడని తెలిపింది.

Guinness World Record, Eric Klabel, popsicle sticks tower, popsicle sticks, Illinois kid world record, popsicle sticks Sculpting, ఎరిక్ క్లాబెల్, గిన్నీస్ వరల్డ్ రికార్డు, ఐసు పుల్లల టవర్,
ఐస్‌క్రీమ్ పుల్లలతో ఎత్తైన టవర్‌... గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు (Credit: Guinness World Records/Twitter)


పిరమిడ్ ఆకారంలో:
ఎరిక్ క్లాబెల్ ఈ టవర్ ఆకృతి కోసం ఎన్నో రోజులు కష్టపడ్డాడు. చివరకు పిరమిడ్ ఆకారంలో టవర్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అంతేకాకుండా బలమైన ఫ్రేమ్ వర్క్‌ను సపోర్ట్‌గా అందించగలిగాడు. ముందుగా టవర్‌ను కొన్ని కొన్ని విభాగాలుగా చేసుకొని నిర్మాణం మొదలు పెట్టాడు. ఒక్కో భాగం మూడు అడుగుల పొడవు ఉంటుంది. నిర్మాణం నిటారుగా ఉండేందుగా చాలాసార్లు పునర్నిర్మించాల్సి వచ్చిందని, ఈ కష్టం వెనుక తన కుటుంబం సపోర్ట్ ఎంతగానో ఉందని చెప్పాడు క్లాబెల్.

ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ 4 రాశుల వారితో జాగ్రత్త... తప్పుచేస్తే అస్సలు క్షమించరు

గిన్నీస్ బుక్‌లో ఇలాంటి చాలా రికార్డులు ఉంటాయి. వాటిని ఎవరైనా బ్రేక్ చేసి... కొత్త రికార్డ్ సృష్టించేందుకు అవకాశాలు ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు ప్రయత్నించుకోవచ్చు.
Published by:Krishna Kumar N
First published:

అగ్ర కథనాలు