ఒక్క శ్వాసతో నీటిలో 267 అడుగుల నడక... గిన్నీస్ వరల్డ్ రికార్డ్
ఓ యువతి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం నీటి అడుగున వెళ్లి.... ఒక్క శ్వాసతో నీటిలో నడక కొనసాగించింది.
news18-telugu
Updated: September 16, 2019, 10:53 AM IST

నీటిలో నడుస్తున్న క్లింగి గిరాయ్
- News18 Telugu
- Last Updated: September 16, 2019, 10:53 AM IST
నీటిలో నిమిషం కాదు కదా... కొందరైతే క్షణం కూడా ఉండలేరు. ఎందుకంటే నీటి అడుగున వెళ్తే మనం ఊపిరి తీసుకోవడం కష్టం మవుతుంది. సాధన చేసిన వారైతే కొన్ని నిమిషాల పాటు నీటిలో ఊపిరి తీసుకోకుండా ఉండగలరు. కానీ ఓ యువతి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం నీటి అడుగున వెళ్లి.... ఒక్క శ్వాసతో నీటిలో నడక కొనసాగించింది. ఇలా ఆమె... 8.6 అడుగుల నీటి లోతులో... 267 అడుగులు నడిచి గిన్నీస్ ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది.
టర్కీ ఫ్రీ డైవర్ బిల్డ్ క్లింగి గిరాయ్ అనే యువతి మహిళా విభాగంలో నీటి అడుగులో నడిచి ఇప్పటివరకు ఉన్న అన్నీ రికార్డుల్ని అధిగమించింది. తాజాగా గిరాయ్ సృష్టించిన తన రికార్డ్‌తో పురుషుల కేటగిరీలో ఉన్న రికార్డ్‌ను కూడా క్రాస్ చేసింది. పురుషుల కేటగిరిలో 267 అడుగులు, 3.24 అంగుళాలు మాత్రమే కొనసాగింది.
క్లింగిగిరాయ్ ఇంతకుముందు 2017 లో కూడా నీటిలో నడిచి రికార్డ్ నెలకొల్పింది. నీటిలో 220 అడుగుల, 4.08 అంగుళాల నీటిలో నడిచి గతంలో కూడా ఈమె ఓ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. కాని అదే సంవత్సరం తరువాత ఆమె సాధించిన విజయాన్ని రష్యన్ అథ్లెట్ మెరీనా కజాంకోవా అధిగమించింది. దీంతో మరోసారి ప్రయత్నించి ఇస్తాంబుల్ోని అగాగ్లు మై వరల్డ్ క్లబ్లో స్విమ్మింగ్ ఫూల్ తో తన తాజా ప్రదర్శనతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది క్లింగి గిరాయ్.

గిన్నీస్ బుక్ రికార్డ్... 70 ద్రాక్ష పండ్లను అడ్డంగా నరికేసి...
98 పెన్సిళ్లతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
పుచ్చకాయలు తినే ఫీట్... గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్...
అహ్మదాబాద్ యువకుల అద్భుతం... పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్‌తో గిన్నీస్ రికార్డు
కైలీ జెన్నర్ రికార్డును బద్దలు కొట్టిన గుడ్డు.. దాని వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
Loading...