• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • GUINNESS RECORD IN COLOMBIA FARMER COUPLE GROWS MANGO WHICH WEIGHING 4 25 KG AND GETS PLACE IN GUINNESS WORLD RECORD NK

Guinness Record: ఈ మామిడికాయ బరువు 4.25 కేజీలు... గిన్నీస్ బుక్ ఎక్కింది...

Guinness Record: ఈ మామిడికాయ బరువు 4.25 కేజీలు... గిన్నీస్ బుక్ ఎక్కింది...

ఈ మామిడికాయ బరువు 4.25 కేజీలు... గిన్నీస్ బుక్ ఎక్కింది... (image credit - twitter)

Guinness Record: అంత పెద్ద మామిడికాయ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అసలు అది అంత పెద్దగా ఎలా కాసింది... ఎలా సాగు చేసారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Guinness Record: మన తెలుగు పాఠాల్లో కోడి గుడ్డంత గోధుమ గింజ అనే పాఠం ఉంటుంది. అందులో ఓ గోధుమ గింజ... కోడిగుడ్డు అంత సైజులో ఉంటుంది. అదో అద్భుతమైన, ఆలోచనాత్మక పాఠం. అదే విధంగా... ఇప్పుడు కొలంబియాలో ఓ మామిడి పండు... ఫుట్‌బాల్ అంత సైజు ఉంది. అక్కడి ఇద్దరు రైతు దంపతులు ఈ కాయను పండించారు. ఇది అంత పెద్దగా కాస్తుందని వారు అనుకోలేదు. రోజురోజుకూ సైజు పెరుగుతుంటే... సరే ఎంత పెరుగుతుందో చూద్దామని వెయిట్ చేశారు. పెరిగీ పెరిగీ చివరకు ప్రపంచంలోనే అతి పెద్ద మామిడికాయ అయ్యింది. విషయం గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారికి తెలిసింది. ఆఘమేఘాలపై కొలంబియా వచ్చారు. కొలంబియాలోని గ్వాయటాలో... జర్మన్ ఓర్లాండో నావోయా, రైనా మారియా మర్రోకన్ దంపతులను కలిశారు. ఏప్రిల్ 29న మామిడి కాయను బరువు చూశారు. అది 4.25 కేజీలు ఉంది. వావ్... అంటూ దాన్ని గిన్నీస్ బుక్‌లో ఎక్కించారు.

    ఇంతకు ముందు 2009లో ఫిలిప్పీన్స్‌లో ఓ మామిడిపండు పెద్దగా కాసింది. దాని బరువు 3.435 కేజీలు ఉంది. ఇప్పటివరకూ దానిపేరునే గిన్నీస్ రికార్డ్ ఉంది. ఇప్పుడు దాన్ని ఇది తిరగరాసింది. ఈ సందర్భంగా కొలంబియా దంపతులు ఏమన్నారంటే... "కొలంబియా ప్రజలు బాగా కష్టపడతారు. వారు మంచి పండ్లను ఉత్పత్తి చేస్తారు. వ్యవసాయాన్ని ప్రేమతో చేస్తారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న సమయంలో... ఈ కాయ కొలంబియా ప్రజలకు కొత్త ఆశ, ఆనందాన్ని ఇవ్వాలి" అని తెలిపారు.


    మొదట ఈ మామిడి పెద్దగా పెరగడంతో... రైతు దంపతుల కూతురు... ప్రపంచంలో పెద్ద మామిడి ఏది అని ఇంటర్నెట్‌లో చూసింది. దాంతో... ప్రపంచంలోనే పెద్ద మామిడి తమదే అని గ్రహించింది. వెంటనే గిన్నీస్ బుక్ వారికి విషయం చెప్పింది. వెంటనే వారూ స్పందించారు.

    ఈ రికార్డ్ సాధించాక... ఆ కుటుంబం ఆ మామిడిని కోసింది. నలుగురికీ పెట్టింది. కుటుంబ సభ్యులు కూడా తిన్నారు. అందరూ అది చాలా టేస్టీగా ఉందనీ, ఆరోగ్యకరంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం... ఇలాంటిదే మరో మామిడి కాయను తమ మున్సిపాలిటీ అధికారులకు ఇచ్చారు. గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన విషయాన్ని వారికి చెప్పారు.

    ఐతే... ఈ మున్సిపాలిటీకి ఇది రెండో గిన్నీస్ రికార్డు. ఎందుకంటే... 2014లో ప్రపంచంలోనే అతి పెద్ద సహజమైన ఫ్లవర్ కార్పెట్ వచ్చింది. అది 3,1999 చదరపు మీటర్లతో గత రికార్డును తిరగరాసింది.

    ఇది కూడా చదవండి: SIP: రోజూ రూ.50 సేవ్ చెయ్యండి... రూ.50 లక్షలు పొందండి... ఎలాగో తెలుసుకోండి

    ఈ రైతు దంపతులు వ్యవసాయం బాగా చేస్తారు. వీళ్లు మామిడితోపాటూ... కాఫీ, అరెపాస్, మొగొల్లాస్ వంటివి పండిస్తారు. ఐతే... వీరు ధనవంతులేమీ కాదు. ఉన్న కొంచెం భూమిలో తమ కుటుంబ అవసరాల కోసమే వ్యవసాయం చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు