Home /News /international /

GREENLAND ICE SHEET LOSES ENOUGH WATER IN 20 YEARS TO SUBMERGE US STUDY GH VB

Greenland Ice Sheet: షాకింగ్.. అక్కడ కరిగిన మంచు నీటితో అమెరికా మునిగిపోతుంది..! పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్కిటిక్(arctic) ప్రాంతంలో వాతావరణంలో వస్తున్న మార్పులతో మంచు భారీగా కరిగిపోతోంది. ఇలానే కొనసాగితే పెనుముప్పు తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు( climate scientists) హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఆర్కిటిక్(arctic) ప్రాంతంలో వాతావరణంలో వస్తున్న మార్పులతో మంచు భారీగా కరిగిపోతోంది. ఇలానే కొనసాగితే పెనుముప్పు తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు( climate scientists) హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ లో మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా వాతావరణం వేడెక్కుతోంది. మంచు కరిగిన నీరు చేరడంతో సముద్రాల్లో(sea levels) నీటి మట్టం కూడా పెరుగుతోంది. ఆర్కిటిక్, గ్రీన్లాండ్స్ లో కనిపిస్తున్న మార్పులు, మంచు కరగడంపై చేపట్టిన పరిశోధనల్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రీన్ లాండ్ (green land)లోని భారీ మంచు పలకలు(ice sheets) కరిగిపోతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో మంచు కరిగి వచ్చిన నీరు యునైటెడ్ స్టేట్స్ (united states) మొత్తాన్ని అర మీటరు ఎత్తు వరకు ముంచేయగలదని డానిష్ పరిశోధకులు తెలిపారు.

PM Modi Record : తగ్గేదే లే..యూట్యూబ్ లో మోదీ వరల్డ్ రికార్డు

భూమి మీద ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆర్కిటిక్ ప్రాంతంలో వాతావరణం త్వరగా వేడెక్కుతోందని, అందుకే గ్రీన్ ల్యాండ్‌లో మంచు కరిగిపోతోందని నాసా(NASA) పేర్కొంటోంది. ఇదే సముద్రాల్లో నీరు పెరగడానికి కారణమని చెబుతోంది. డానిష్ ఆర్కిటిక్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో కలిసి పోలార్ పోర్టల్ చేసిన పరిశోధనలో.. 2002 నుంచి ఇప్పటి వరకు గ్రీన్ ల్యాండ్‌లో 4,700 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయింది. 4700 క్యూబిక్ కిలోమీటర్ల మేర కరిగిన నీరు అమెరికాను అర మీటర్ మేర ముంచేయగలదని చెబుతున్నారు. హిమపాతం కరగడం వల్ల సముద్రాల్లో 1.2 సెం.మీ. వాటర్ లెవల్ పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు.

యూఎస్- జర్మన్ గ్రేస్ ప్రోగ్రామ్ (గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్‌పరిమెంట్) నుంచి సేకరించిన శాటిలైట్ ఇమేజెస్ (satellite images)ఆధారంగా పొలార్ పోర్టల్ పరిశోధన జరిపింది. ఆర్కిటిక్ ప్రాంతంలోని తీరాల్లో ఎక్కువగా మంచు కరుగుతోందని గుర్తించింది. తాము చేసిన పరిశీలనలో మంచు ఫలకాలు సన్నగా మారుతున్నాయని గుర్తించామని పేర్కొంది. గ్లేసియర్ ముందు భాగాల్లో మంచు పడిపోతోందని, గ్రీన్ లాండ్ పశ్చిమ తీరంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని వివరించింది.

భూమి మొత్తంతో పోలిస్తే ఆర్కిటిక్ వద్ద 3 నుంచి 4 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాసా జనవరిలో ప్రచురించిన వివరాల్లో.. ఆర్కిటిక్ సముద్రం వేడెక్కుతున్న కారణంగా గ్రీన్ లాండ్స్ ప్రాంతంలో మంచు కరిగిపోతోందని పేర్కొంది. వాతావరణం లో గాలి వేడి అయి మంచు కరిగిపోయేలా చేస్తోందని వివరించింది. 25 ఏళ్లలో ఇప్పుడు 6 నుంచి 7 రెట్లు ఎక్కువగా సముద్రాల్లో నీటి స్థాయి పెరుగుతోందని, గ్లేసియర్లు ఆదే స్థాయిలో తగ్గిపోతున్నాయని ఓ యూఎస్ ఏజెన్సీ తెలిపింది.

iPhone Offer: ఐఫోన్‌పై రూ.18,000 పైనే డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం.. గ్రీన్ లాండ్స్ లోని మంచు ఫలకాలు మొత్తం కరిగితే సముద్రాల్లో నీటి మట్టాన్ని 7 మీటర్లు పెంచగలవని, అంటార్కిటిక్ రీజియన్‌లోని మంచు కరిగితే 50 మీటర్ల మేర సముద్రాల నీటి మట్టాన్ని పెంచుతాయని చెబుతున్నారు. ఆర్కిటిక్ సముద్రాన్ని కప్పిన మంచు కరిగినా నీటి స్థాయిపై ప్రభావం కనిపించడం లేదన్నారు. పదేళ్లలో నీటి మట్టం పెరగడం 13 శాతం తగ్గిందని వివరించారు.
Published by:Veera Babu
First published:

Tags: Greenland, USA

తదుపరి వార్తలు