GREECE GOVT BIG SHOCK TO UNVACCINATED PEOPLE PLANNING TO IMPOSE MONTHY FINE TO ABOVE 60 YEARS PVN
Big Shock To Unvaccinated : వాక్సిన్ తీసుకోని వారికి బిగ్ షాక్..నెలనెలా భారీగా జరిమానా..ఎంతంటే
ప్రతీకాత్మక చిత్రం
Unvaccinated People To Pay Fine : వాక్సిన్ తీసుకోని వారికి గ్రీస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. వాక్సిన్ తీసుకోని 60ఏళ్ళు పైబడిన వారికి నెలనెలా జరిమానా విధించనున్నట్లు గ్రీస్ ప్రభుత్వం ప్రకటించింది.
Fine For Unvaccinated : ప్రపంచవ్యాపంగా కరోనా వైరస్(Covid-19) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)రూపంలో మళ్ళీ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తో సహా చాలా దేశాలు వాక్సినేషన్ డ్రైవ్ ను మరింత వేగవంతం చేశాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆశక్తి చూపించడంలేదని ఆయా దేశాల వాక్సినేషన్ లెక్కలను బట్టి అర్ధమవుతోంది.
ప్రభుత్వాలు ఎన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన,కోవిడ్ వాక్సిన్ తీసుకున్నవారికి ప్రైవేటు సంస్థలు కూడా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో వాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు వెనకడుగేస్తున్నారు. ఒమిక్రాన్ విరుచుపడుకుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలందరికి వాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ తో సహా పలు దేశాలు వాక్సిన్ తీసుకోని వారి విషయంలో కఠిన చర్యలకు సిద్దమవవుతున్నాయి.
తాజాగా గ్రీస్ ప్రభుతం కూడా కొవిడ్ వాక్సిన్ తీసుకొని వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 టీకాలు తీసుకోని 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ జరిమానా విధించాలని గ్రీస్ ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. నెలకు 100 యూరోలు వరకు జరిమానా విధించవచ్చునని సమాచారం. జరిమానాల ద్వారా సేకరించిన నిధులను కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఆసుపత్రులకు ఇవ్వబడతాయని గ్రీస్ అధికారులు తెలిపారు. ఈ జరిమానా నిర్ణయం తగ్గిన వాక్సిన్ స్థాయిలను పెంచడానికి మరియు ఆరోగ్య సంరక్షణపై ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా ఉంటుందని గ్రీస్ ప్రభుత్వం భావిస్తోంది.
జరిమానా నుంచి తప్పించుకోవడానికి...60 ఏళ్లు పైబడి ఇప్పటివరకు వాక్సిన్ తీసుకోని వారందరూ తక్షణమే వాక్సిన్ తీసుకోవాలని గ్రీస్ ప్రధానమంత్రి "కైరియాకోస్ మిత్సోటాకిస్" అభ్యర్ధించారు. ఇది జరిమానా విషయం కాదని, జరిమానా విధించబడుతుంది కానీ అది చాలా తక్కువ అని, మీ జీవితాన్ని, మీరు ఇష్టపడే వారి జీవితాలను రక్షించుకోండి మరియు వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని అర్థం చేసుకోండి అని .గ్రీస్ ప్రధానమంత్రి తెలిపారు.
టీకాలు తీసుకోని వారు కరోనావైరస్ సోకి ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని గ్రీక్ అధికారులు చెబుతున్నారు. గ్రీస్‌లో కోవిడ్ సంబంధిత మరణాలలో 10 మందిలో తొమ్మిది మంది 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ఉన్నారు. అయితే వైరస్ సోకి ఆసుపత్రిలో చేరిన వారిలో 10 మందిలో ఏడుగురు 60 ఏళ్లు పైబడిన వారు ఉండగా..వీరిలో 10 మందిలో ఎనిమిది మంది కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారేనని స్థానిక అధికారులు తెలిపారు.
గ్రీస్ లో గతేడాది నవంబర్‌లో నిర్బంధ వాక్సిన్ షాట్లను ప్రకటించే ముందు..గ్రీస్‌లో దాదాపు 520,000 మంది సీనియర్ సిటిజన్లు కోవిడ్ టీకాలు తీసుకోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ డేటా చెబుతోంది. అయితే,యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల సగటు కంటే గ్రీస్ దాదాపు మూడింట రెండు వంతుల మందికి పూర్తిగా టీకాలు వేసింది.
ఇక, యూరప్‌లోని చాలా దేశాల్లో మాదిరిగానే గ్రీస్‌లో కూడా కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా ఈ నెలలో రోజువారీ కోవిడ్ కేసుల్లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. కోవిడ్-సంబంధిత మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.