GRANDFATHER CHARGED 3 YEARS JAIL FOR DEATH OF HIS GRAND DAUGHTER FROM A CRUISE SHIP WINDOW MS GH
Cruise Ship: సంచలన కేసులో తాతకు శిక్ష.. మనువరాలి మరణానికి తాతయ్య నిర్లక్ష్యమే కారణమన్న కోర్టు
ప్రతీకాత్మక చిత్రం
Cruise Ship: చిన్నారి ప్రాణం తీసిన తాత నిర్లక్ష్యం.. 3 ఏళ్ల శిక్ష.. సంచలనం సృష్టించిన కేసు.. 2019లో జరిగిన ఈ విషాదంపై తుది తీర్పు వెలువరించిన కోర్టు నిందితుడికి 3 ఏళ్ల శిక్ష విధించింది.
తాతయ్య నిర్లక్ష్యం.. చిన్నారి ప్రాణం తీసింది. 2019లో జరిగిన ఈ విషాదంపై తుది తీర్పు వెలువరించిన కోర్టు నిందితుడికి 3 ఏళ్ల శిక్ష విధించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. రాయల్ కరీబియన్ క్రూస్ షిప్ లో 18 నెలల మనువరాలితో ఆడుకుంటున్న తాత అనెలో ఏమారుపాటుతో ప్రమాదవశాత్తు చ్లో వైగాండ్ అనే చిన్నారి సముద్రంలోకి పడి మరణించింది. ఇదంతా గ్రాండ్ ఫాదర్ నిర్లక్ష్యంతో జరిగిన పని అని తేల్చిన న్యాయస్థానం మూడేళ్ల శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. క్రూజ్ పైన ఉన్న 11వ అంతస్థులో తన తాతతో ఆడుకుంటున్న చిన్నారి కిటికీ నుంచి ప్రమాదవశాత్తూ జారిపడింది. ఇది 115 అడుగుల ఎత్తులో ఉన్న కిటికీ కావటంతో చిన్నారి ప్రాణాలు విడిచింది.
విచారణలో భాగంగా ఇందులో తన తప్పు, నిర్లక్ష్యం ఏమీ లేదని అనెలో తనను క్షమించమని కోర్టు ముందు వైగాండ్ పశ్చాత్తాపం వ్యక్తంచేసినా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. కిటికీ తలుపులు అద్దాల వాకిలితో మూసి ఉన్నాయని తాను భావించినట్టు ఆయన వాదించారు. అయితే అలా భావించేందుకు ఎటువంటి అవకాశాలు లేవని క్రూజ్ యాజమాన్యం స్పష్టంగా రుజువు చేయగలిగింది. దీంతో అనెలో నేరం చేసినట్టు కోర్టు తీర్పుచెప్పింది.
అద్దం ఉందని...
అయితే కిటికీలపై అద్దం ఉందని తాను భావించినట్టు అనెలో చెప్పుకొచ్చారు. కానీ క్రూజ్ కిటికీలపై అలాంటిదేదీ లేకపోవటంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని.. క్రూజ్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ కుటుంబం భావించినట్టు ఆయన గతంలో చెప్పుకొచ్చారు. కానీ ఆయన వాదనను బలపరిచేలా ఒక్క రుజువు లభించకపోవటంతో ఈ సివిల్ కేసులో క్రూజ్ కు క్లీన్ చిట్ లభించింది. ఒకవేళ కిటికీలపై గ్లాస్ ఉండిఉంటే ప్రమాదం జరిగేదే కాదంటూ ఆయన వాపోయారు. మరోవైపు తమ కుటుంబమంతా ఈ దుర్ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు, భవిష్యత్తులో తామంతా కలిసికట్టుగా ఉంటామనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేస్తున్నారు.
కరీబియన్ ఐల్యాండ్ లోని ప్యూర్టో రికోలో జూలై 7, 2019లో ఫ్రీడం ఆఫ్ ద సీస్ క్రూజ్ షిప్ అనే భారీ క్రూజ్ లో జరిగిన ఈ ప్రమాదం సంచలనం సృష్టించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మిచిగన్ లో ఉంటున్న ఈయన తన శిక్షను అక్కడే పూర్తిచేయాల్సి ఉంటుంది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.