గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి మరో కీలక బాధ్యత..

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్,వెబ్ సెర్చింగ్ ఇతరత్రా టాస్క్‌లకు సంబంధించిన టెక్నాలజీని సుందర్ పిచాయ్ మరింత ముందుకు తీసుకెళ్తారని లారీ పేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: December 4, 2019, 9:10 AM IST
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి మరో కీలక బాధ్యత..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(ఫైల్ ఫోటో)
  • Share this:
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతను కూడా తీసుకోనున్నారు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌కి ఆయన సీఈవోగా నియమితులు కానున్నారు. అల్ఫాబెట్ బాధ్యతల నుంచి దాని వ్యవస్థాపకులు లారీ పేజ్,సెర్జెయ్ బ్రిన్ తప్పుకోవడంతో పిచాయ్‌కి ఆ బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ.. కంపెనీ షేర్ హోల్డర్స్‌గా,బోర్డు డైరెక్టర్స్‌గా సంస్థకు తమ సలహాలు-సూచనలు కొనసాగిస్తామన్నారు. గూగుల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఈ విషయాలను వెల్లడించారు.
సుందర్ పిచాయ్‌కి సీఈవో బాధ్యతలు అప్పగించడం పట్ల లారీ పేజ్,సెర్జెయ్ బ్రిన్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్,వెబ్ సెర్చింగ్ ఇతరత్రా టాస్క్‌లకు సంబంధించిన టెక్నాలజీని సుందర్ పిచాయ్ మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్,అల్ఫాబెట్‌లను నడపడానికి పిచాయ్‌‌ని మించినవారు లేరని తాము భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, తాజా బాధ్యతల పట్ల పిచాయ్ హర్షం వ్యక్తం చేశారు. అల్ఫాబెట్‌ను ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నట్టు చెప్పారు.


First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు