Bhikhari అని గూగుల్‌లో టైప్ చేస్తే పాక్ ప్రధాని ఫొటో..
కొన్ని రోజుల క్రితం టాయిలెట్ పేపర్ అని గూగుల్‌లో శోధిస్తే పాకిస్తాన్ జాతీయ జెండా దర్శనమిచ్చింది.
news18-telugu
Updated: August 18, 2019, 3:55 PM IST

గూగుల్‌లో కనిపిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఫొటో (Image:News18Assam)
- News18 Telugu
- Last Updated: August 18, 2019, 3:55 PM IST
బికారి (అడుక్కునేవాడు) అని ఇంగ్లీష్‌లో గూగుల్‌లో టైప్ చేస్తే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు ప్రత్యక్షం అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాసిపోయిన గడ్డం, మీసాలతో కూడిన ఫొటో దర్శనమిస్తోంది. దీంతోపాటు ఆయన చేతిలో ఓ రేకు డబ్బా (అడుక్కుంటున్నట్టు)గా ఫొటోలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద విదేశీ ద్రవ్య నిల్వలు 7.76 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయి. ఓ రకంగా బంగ్లాదేశ్ కంటే కూడా చాలా తక్కువ. బంగ్లాదేశ్‌లో 32 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వ ఉంది. జీడీపీ కూడా 4శాతానికి పరిమితం అయింది. 2019 జూన్‌లో పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 8.9 శాతంగా నమోదైంది. కొన్ని రోజుల క్రితం టాయిలెట్ పేపర్ అని గూగుల్‌లో శోధిస్తే పాకిస్తాన్ జాతీయ జెండా దర్శనమిచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇడియట్ అని గూగుల్‌లో టైప్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఫొటో దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను కూడా ప్రశ్నించాడు.
డోంట్ వర్రీ సర్ఫరాజ్... ఇమ్రాన్ ఖాన్ సలహా
పాక్ ప్రధానికి కృతజ్ఞతలు... ప్రధాని మోదీ
పాక్ ప్రధానిని కలుస్తున్న టాలీవుడ్ హీరోయిన్... ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ నేత సిద్ధూకు పాకిస్థాన్ ప్రధాని సర్ప్రైజ్ గిఫ్ట్...
భారత్‌కు మద్దతిస్తున్న దేశాలపై క్షిపణి దాడి... పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్లో సామాజిక కార్యకర్తల మెడ మీద కత్తి... ఇదిగో సాక్ష్యం..
Loading...