హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

మైక్రోబయాలజిస్ట్‌ 'హాన్స్ క్రిస్టియన్ గ్రామ్' సేవల్ని గుర్తు చేస్తున్న గూగుల్

మైక్రోబయాలజిస్ట్‌ 'హాన్స్ క్రిస్టియన్ గ్రామ్' సేవల్ని గుర్తు చేస్తున్న గూగుల్

హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ గూగుల్ డూడుల్ (Image: Google)

హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ గూగుల్ డూడుల్ (Image: Google)

Hans Christian Gram's 166th Birth Anniversary : 1884లో బెర్లిన్‌లో... సిటీ హాస్పిటల్‌లో జర్మనీ మైక్రో బయాలజిస్ట్ కార్ల్ ఫ్రైడ్లాండర్‌‌తో కలిసి... హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ ఓ టెక్నిక్ కనిపెట్టారు. దాని ద్వారా బ్యాక్టీరియాను వర్గీకరించడానికి వీలైంది. హాన్స్ 166వ జయంతి సందర్భంగా... డూడుల్‌తో ఆయన సేవల్ని గుర్తుచేసింది గూగుల్.

ఇంకా చదవండి ...

Hans Christian Gram : 1853 సెప్టెంబర్‌ 13న జన్మించిన డెన్మార్క్ మైక్రోబయాలజిస్ట్ హాన్స్ క్రిస్టియన్ గ్రామ్... 166వ జయంతి సందర్భంగా... ప్రత్యేక డూడుల్ తయారుచేసి ఆయనకు అంకితం చేసింది గూగుల్. హాన్స్... ప్రత్యేక స్టైనింగ్ వర్గీకరణ విధానాన్ని కనుక్కున్నారు. దీని ద్వారా... బ్యాక్టీరియాలను వివిధ వర్గాల కింద విభజించడానికి వీలవుతోంది. డెన్మార్క్ గెస్ట్ ఆర్టిస్ట్ మిక్కెల్ సొమ్మెర్... ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇందులో గ్రామ్ తన పరిశోధనలు చేస్తున్నట్లు చూపిస్తూ, ఆయన కళ్లద్దాలు, మైక్రోస్కోప్, బ్యాక్టీరియా అన్నింటినీ ఉంచారు. 1884లో బెర్లిన్‌లో... సిటీ హాస్పిటల్‌లో జర్మనీ మైక్రో బయాలజిస్ట్ కార్ల్ ఫ్రైడ్లాండర్‌‌తో కలిసి... హాన్స్ క్రిస్టియన్ గ్రామ్ ఓ టెక్నిక్ కనిపెట్టారు. దాని ద్వారా బ్యాక్టీరియాను వర్గీకరించడానికి వీలైంది.


ఊపిరితిత్తుల కణజాలాల్లోని మురికి ప్రదేశాల్లో ఉండే బ్యాక్టీరియాను స్పష్టంగా చూసే ఉద్దేశంతో గ్రామ్... ఓ పరికరాన్ని తయారుచేశారు. దానితో... ల్యాబ్‌లో కార్ల్ ఫ్రైడ్లాండర్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియా వయలెట్ రంగులో ఉండటాన్ని గుర్తించాడు. కొన్ని రకాల రసాయనాల్ని ఉపయోగించడం ద్వారా... వేర్వేరు శాంపిల్స్‌లో వేర్వేరు బ్యాక్టీరియాల్ని గుర్తించడానికి వీలైంది.


1878లో కోపెన్‌హాగన్ యూనివర్శిటీ నుంచీ MD చేసిన గ్రామ్... బ్యాక్టీరియాలజీ, ఫార్మాకాలజీ చదివేందుకు యూరప్ వెళ్లారు. 1884లో తాను చేసిన పరిశోధనల వివరాల్ని ఆయన ఓ స్కాలర్లీ జర్నల్‌లో పొందుపరిచారు. అప్పటి నుంచీ గ్రామ్-పాజిటివ్, గ్రామ్-నెగెటివ్ అనే పదాలు పుట్టుకొచ్చాయి.


తను కనిపెట్టిన విధానం పూర్తిస్థాయి సరైనది కాదనీ, అందులో లోపాలు ఉన్నా... అది ఉపయోగపడుతుందని గ్రామ్ తెలిపారు. భవిష్యత్తులో పరిశోధకులు సరైన విధానాన్ని కనిపెట్టగలరని భావిస్తున్నట్లు తెలిపారు. ఐతే... ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పటికీ దీన్ని వాడుతున్నారు.

First published:

Tags: Google, Google Doodle

ఉత్తమ కథలు