జుంకో తాబేని గుర్తుచేసిన గూగుల్ డూడుల్... ఆమె ఎవరంటే...

Junko Tabei : 1975లో జుంకోతాబే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లింది. దట్టమైన మంచు, ఈదురు చలి గాలులు, మంచు తుఫాన్లు, భిన్నమైన వాతావరణం, ఊపిరాడని పరిస్థితులు... అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ... ఆమె ప్రాణాలకు తెగించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 10:34 AM IST
జుంకో తాబేని గుర్తుచేసిన గూగుల్ డూడుల్... ఆమె ఎవరంటే...
జుంకో తాబేని గుర్తుచేసిన గూగుల్ డూడుల్.
  • Share this:
Junko Tabei : జపాన్‌కి చెందిన పర్వతారోహిణి జుంకో తాబే... ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన మొదటి మహిళ. 1939 సెప్టెంబర్ 22న ఆమె జన్మించిన సందర్భంగా... గూగుల్... ప్రత్యేక డూడుల్ తయారుచేసింది. జుంకో తాబేకి మరో ఘనత కూడా ఉంది. ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఎత్తైన ఏడు పర్వతాల్నీ అధిరోహించిన మొదటి మహిళ కూడా ఆమే. నిజానికి జుంకో తాబే... తన తల్లిదండ్రుల ఏడుగురు సంతానంలో ఐదో అమ్మాయి. పుట్టినప్పుడు చాలా నీరసంగా ఉండేది. అలాంటి ఆమె... పదో ఏటనే పర్వతాలు ఎక్కడం మొదలుపెట్టింది. ఫుక్‌షిమా దగ్గర్లోని నాసూ పర్వతంపై ట్రైనింగ్ పొందింది. హైస్కూల్‌లో చదివేటప్పుడే చుట్టుపక్కల చాలా పర్వతాలు ఎక్కేసింది. తగినంత డబ్బులేకపోవడంతో... ఇంకా కొన్ని పర్వతాలు ఎక్కలేకపోయింది.


ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన జుంకో తాబే... పర్వతారోహకుల క్లబ్‌లో చేరింది. ఐతే... చాలా మంది తమతో ఆమె రావడాన్ని వ్యతిరేకించేవాళ్లు. దాంతో... మహిళల కోసం ప్రత్యేక క్లబ్ ఎందుకు ఉండకూడదని భావించి... 1969లో లేడీస్ క్లైంబింగ్ క్లబ్ స్థాపించింది. అప్పట్లో జపాన్‌లో అదో సంచలనం.
జపాన్‌లో అందమైన ఫుజి పర్వతాన్ని అధిరోహించిన తర్వాత... జుంకో తాబే... స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతాలను ఎక్కేసింది. 1972లో జపాన్‌లో పర్వతారోహిణిగా అధికారిక గుర్తింపు పొందింది. 1975లో జుంకోతాబే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్లింది. దట్టమైన మంచు, ఈదురు చలి గాలులు, మంచు తుఫాన్లు, భిన్నమైన వాతావరణం, ఊపిరాడని పరిస్థితులు... అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ... ఇద్దరు మహిళలు మాత్రమే ఎవరెస్ట్ పర్వతం దగ్గర్లో ఉండే... అన్నపూర్ణ శిఖరాగ్రాన్ని చేరుకోగలిగారు. ఒకరు జుంకో తాబే, మరొకరు హిరోకో హిరాకావా. ఎవరెస్ట్ ఎక్కే చాలా మంది ముందుగా అన్నపూర్ణను ఎక్కుతారు.


అన్నపూర్ణను జయించిన జుంకో తాబే... డబ్బు కోసం కార్ల సీట్లు, వాటర్ ప్రూఫ్ పౌచ్‌లు, ఓవర్ గ్లోవ్స్ వంటి వాటిని రీసైకిల్ చేసి అమ్మింది. మొత్తానికి అన్నీ సిద్ధం చేసుకొని ఎవరెస్ట్ ఎక్కేందుకు వెళ్లినప్పుడు... కఠిన వాతావరణంలో ఆమె... 6,300 మీటర్లు ఎక్కున తర్వాత... మంచు తుఫానులో చిక్కుకొని స్పృహ కోల్పోయింది. ఆమె షేర్పా గైడ్ ప్రయత్నాలతో ఆరు నిమిషాల తర్వాత తిరిగి స్పృహ లోకి వచ్చింది. తుఫాను వచ్చిన 12 రోజుల తర్వాత... 1975 మే 16న ఎవరెస్ట్‌ని అధిరోహించి... ప్రపంచ రికార్డ్ సృష్టించింది జుంకో తాబే. ఆ తర్వాత ఆమె ఎన్నో పర్వతాల్ని తన ముందు తల వంచుకునేలా చేసింది.


2012లో జుంకో తాబే పెరిటోనియల్ కాన్సర్ బారిన పడింది. అయినప్పటికీ ఆమె పర్వతాలు ఎక్కడం మానలేదు. చివరకు 2016 అక్టోబర్ 20న జపాన్‌లోని కవాగో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయింది. ఇంతటి స్పూర్తిదాయకమైన ఆమె జయంతి సందర్భంగా... గూగుల్ డూడుల్ ద్వారా ఆమె సాహసాల్ని మనకు గుర్తుచేస్తోంది.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>