Google CEO awarded Padma Bhushan : గూగుల్,ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) భారత మూడో అత్యున్నత పౌరపురస్కారమైన "పద్మభూషణ్"(Padma Bhushan)ను అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధు..శనివారం శాన్ ఫ్రాన్సిస్కోలో సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్‌ను ప్రదానం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలొ భారత ప్రభుత్వం.. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో సుందర్ పిచాయ్‌ను పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. శాన్ ఫ్రాన్సిస్కోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ అవార్డును అందుకున్నారు సుందర్ పిచాయ్.
"సుందర్ పిచాయ్‌కు పద్మభూషణ్‌ను అందజేయడం ఆనందంగా ఉంది. మదురై నుంచి మౌంటెన్ వ్యూ వరకు సుందర్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. భారతదేశం-అమెరికా ఆర్థిక సాంకేతికతను బలోపేతం చేస్తుంది. సంబంధాలు, ప్రపంచ ఆవిష్కరణలకు భారతీయ ప్రతిభావంతుల సహకారాన్ని పునరుద్ఘాటిస్తుంది" అని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఓ ట్వీట్ లో తెలిపారు.
పద్మభూషణ్ ఇచ్చినందుకు రాయబారి సంధు, కాన్సుల్ జనరల్ ప్రసాద్‌లకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నమ్మశక్యం కానిది. నన్ను తీర్చిదిద్దిన దేశం ఇలా గౌరవించడం అర్థవంతంగా ఉంది. నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి, భారతీయులకు నా ధన్యవాదాలు. నన్ను ఈస్థాయికి తీర్చిదిద్దిన దేశం నుంచి ఇంతటి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకోవడం చాలా అర్థవంతంగా అనిపిస్తోంది. భారత్ నాలో భాగం. భారతీయత ఎప్పటికీ నాతో పాటే ఉంటుంది. ఇండియా చెప్పిన విలువలను నేను ఎక్కడికి వెళితే అక్కడి తీసుకెళతాను. ఈ అవార్డు మాత్రం భద్రంగా దాచుకుంటాను. జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం నిరంతరం కృషిచేసే కుటుంబంలో నేను పుట్టడం చాలా అదృష్టం. నేను నా ఆసక్తులు, ఇష్టాలను వెతుక్కుంటూ వెళ్లడంతో నా తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు. వారికి నా ధన్యవాదాలు"అంటూ అని అవార్డు స్వీకరించిన పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు.
Delighted to hand over Padma Bhushan to Google CEO Sundar Pichai in San Francisco. His inspirational journey from Madurai to Mountain View, strengthening India-America economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation: Ambassador Taranjit S Sandhu pic.twitter.com/fxiSouYrIk
— ANI (@ANI) December 3, 2022
ఫేస్ బుక్ డీపీ చూసి మోసపోయిన యువకుడు..40 లక్షలు మోసం చేసిన కిలాడీ ఆంటీ
భారత్ లో టెక్నాలజీ వేగంగా వృద్ధి చెందుతోందని, ఈ పరిణామాలు చాలా సంతోషకరమని సుందర్ పిచాయ్ అన్నారు. ఇండియా నుంచి వచ్చే ఆవిష్కరణలతో ప్రపంచం లబ్ధిపొందుతోందన్నారు. ఇలాంటి భారత దేశానికి ఎప్పుడు వెళ్లినా అద్భుతంగానే ఉంటుందన్నారు. గూగుల్, ఇండియాతో భాగస్వామ్యాన్ని కొనసాగించాలని నేను భావిస్తున్నాను.. ఈ రెండూ కలిస్తే ప్రజలకు టెక్నాలజీ రూపంలో మంచి జరుగుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు. డిజిటల్ ఇండియా దార్శనికత ఖచ్చితంగా దేశ పురోగతికి యాక్సిలరేటర్గా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌ని కూడా ఆయన ప్రశంసించారు. తాము భారతదేశంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ఆయన ప్రకటించారు.డిజిటల్ ఇండియా దార్శనికత ఖచ్చితంగా దేశ పురోగతికి యాక్సిలరేటర్గా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌ని కూడా ఆయన ప్రశంసించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Padma Awards, Sundar pichai