హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Visa: అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో అదిరిపోయే గుడ్ న్యూస్

US Visa: అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో అదిరిపోయే గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

US Visa: ప్రస్తుతానికి యూఎస్‌, ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తోందని, భారతదేశంలో మాత్రమే అన్ని కేటగిరీలలో చాలా మంది దరఖాస్తుదారులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

US Visa: ఇండియా(India)లో చాలా మంది ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు అమెరికా వెళ్తుంటారు. అగ్రరాజ్యానికి పర్యటనల కోసం వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. వీరందరూ యూఎస్ వీసాలు (US Visa) తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వివిధ రకాల వీసా అప్లికేషన్ల (Visa Applications) వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది.  H-1B వీసాలు, B-1 బిజినెస్‌ వీసాలు, B-2 టూరిజం వీసాలు, H, L కేటగిరీలు వంటి ఇమిగ్రెంట్‌ వర్క్ వీసాల వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికే వీసా ఇంటర్వ్యూలు రద్దు చేశామని, షిప్పింగ్ కంపెనీలు, విమానయాన సంస్థల సిబ్బంది వీసాలకు కూడా వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గుతుందని వివరించారు. 2023 జూన్-జులై నాటికి వీలైనంత మేరకు వెయిటింగ్‌ పీరియడ్‌ తగ్గించి, సాధారణ స్థితికి తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు.

Maldives Fire Mishap: మాల్దీవుల్లో 9 మంది భారతీయ కార్మికులు సజీవ దహనం.

* 100,000 స్లాట్స్‌ ఓపెన్‌ చేసిన యూఎస్‌

నిబంధనలలో మార్పులు చేయడం, హెచ్, ఎల్ వర్క్ వీసాల కోసం 100,000 స్లాట్‌లను ఓపెన్‌ చేయడం ద్వారా ఇప్పటికే కొంత పురోగతి సాధించామని ఆయన చెప్పారు. ‘డ్రాప్‌బాక్స్’ ఫెసిలిటీ ద్వారా ఈ కేటగిరీలలోని దరఖాస్తుదారులపై యూఎస్‌ దృష్టి సారిస్తుందని తెలిపారు. ఇప్పటికే యూఎస్‌ వీసా జారీ చేసిన వారికి, ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు పొందిన వారికీ ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. కుటుంబ సభ్యులను కలవడానికి భారతదేశాన్ని సందర్శించాలనుకునే యూఎస్‌లోని H-1B వీసా హోల్డర్‌లకు కూడా ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆ తర్వాతే మొదటిసారి దరఖాస్తు చేసుకుంటున్నవారిపై దృష్టి పెడుతుందని తెలిపారు.

* అప్లికేషన్స్‌ ప్రాసెసింగ్‌కు ప్రత్యేక చర్యలు

తాత్కాలిక ఉద్యోగులను ఉపయోగించడం, ప్రాసెసింగ్ కోసం రిమోట్ లొకేషన్‌లకు భారతీయ అప్లికేషన్‌లను పంపడం వంటి చర్యలను కూడా యూఎస్‌ పరిశీలిస్తోంది. ముఖ్యంగా డ్రాప్ బాక్స్ సౌకర్యాన్ని ఉపయోగించే వారి కోసం ఈ విధానం వినియోగించే యోచనలో ఉంది. నిబంధనలలో కొన్ని మార్పులు చేయడం వల్ల ఎక్కువ మంది భారతీయులు ఇంటర్వ్యూ మినహాయింపు పొందడానికి డ్రాప్ బాక్స్ సదుపాయానికి అర్హులు అవుతారు. ఉదాహరణకు గత నాలుగు సంవత్సరాలలో యూఎస్‌ వీసా గడువు ముగిసిన వారు కొత్త B-1 లేదా B-2 వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు డ్రాప్ బాక్స్ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. US వీసా గడువు ముగిసిన విద్యార్థులు కూడా కొన్ని షరతులతో డ్రాప్ బాక్స్ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.

* తగ్గిన వీసా వెయిటింగ్‌ పీరియడ్‌

H, L వీసాల కోసం 100,000 అదనపు స్లాట్స్ ఓపెన్ చేయడం వల్ల వెయిటింగ్‌ పీరియడ్‌ సగానికి సగం తగ్గింది. B-1, B-2 వీసాల కోసం డ్రాప్ బాక్స్‌ను ఉపయోగించే వారి వెయిటింగ్‌ పీరియడ్‌ చాలా నెలలుగా కొనసాగుతుంది. తీసుకుంటున్న చర్యలతో రాబోయే తొమ్మిది నెలల్లో పురోగతిని సాధిస్తామని అధికారి తెలిపారు. వీసా అపాయింట్‌మెంట్‌కు సంబంధించిన యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్ B-1, B-2 వీసాల కోసం మొదటిసారి భారతీయ దరఖాస్తుదారుల వెయిటింగ్‌ పీరియడ్‌ను 925 రోజులుగా చూపుతోందని తెలిపారు. వాస్తవ సమయం ఇంకా తక్కువగా ఉంటుందని చెప్పారు.

* ఇండియాకు మొదటి ప్రాధాన్యం

ప్రస్తుతానికి యూఎస్‌, ఇండియాకు మొదటి ప్రాధాన్యం ఇస్తోందని, భారతదేశంలో మాత్రమే అన్ని కేటగిరీలలో చాలా మంది దరఖాస్తుదారులు ఉన్నారని అధికారి చెప్పారు. కరోనా తర్వాత వీసాలకు పెరిగిన డిమాండ్‌ను అధికారులు ఊహించలేదని, 2025లో మాత్రమే డిమాండ్ పెరుగుతుందని నిపుణులు భావించారని తెలిపారు. 2023 నాటికి భారతదేశంలో అన్ని రకాల వీసాల కోసం దరఖాస్తులు నెలకు 100,000, లేదా సంవత్సరానికి 1.2 మిలియన్లకు పెరుగుతాయని యూఎస్‌ అంచనా వేస్తోంది. వీసా ఆపరేషన్స్‌లో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశంగా ఇండియా నిలుస్తుంది.

First published:

Tags: America, International, International news, Us news, USA

ఉత్తమ కథలు