హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Joe Biden- Vanita Gupta: భారతీయులకు శుభవార్త చెప్పిన జో బైడెన్.. మరో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్

Joe Biden- Vanita Gupta: భారతీయులకు శుభవార్త చెప్పిన జో బైడెన్.. మరో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్

జో బైడెన్, వనితా గుప్త (ఫైల్ ఫొటోలు)

జో బైడెన్, వనితా గుప్త (ఫైల్ ఫొటోలు)

అమెరికాలోని భారత సంతతి పౌరులకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పండగలాంటి వార్తను చెప్పారు. మరో కీలక పదవికి భారత సంతతి మహిళను నామినేట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో దూకుడును పెంచారు. తీవ్ర ఉత్కంఠ మధ్య ఎన్నికల్లో గెలిచిన ఆయన జనవరి 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన అగ్రరాజ్య పాలనా పగ్గాలను చేపట్టి ఏప్రిల్ 20 నాటికి సరిగ్గా వంద రోజులు పూర్తయింది. ఈ వంద రోజుల్లో పాలనా పరంగా తమదైన ముద్రను వేసిన జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తూనే ప్రజలకు ఆమోదయోగ్యమైన రీతిలో విధానాలను రూపొందింపజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భారతీయులకు తన ప్రభుత్వంలో స్థానం కల్పించడం గమనార్హం. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కు భారతీయ మూలాలున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ సంతతి వనిత అమెరికాలో కీలక పదవికి నామినేట్ అయింది.

వనితా గుప్తా అనే భారత సంతతి మహిళను అసోసియేట్ అటార్నీ జనరల్ గా నియమిస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ పదవిని అలంకరించున్న తొలి అమెరికేతర వ్యక్తి, తొలి భారతీయ మహిళగా వనితా గుప్తా రికార్డు సృష్టించనున్నారు. వనితా గుప్తా నియామకానికి యూఎస్ సెనేట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఆమె నియామకంపై సెనేట్ లో జరిగిన ఓటింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ సెనేటర్ కూడా ఆమె నియామకానికి మద్దతుగా ఓటు వేయడం గమనార్హం. వంద మంది సభ్యులు కలిగిన సెనేట్ లో రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి సమానంగా బలాబలాలు ఉన్నాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లీసా మర్కోస్కీ అనూహ్యంగా వనితా గుప్తా నియామకానికి అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు పాస్ అయింది. వనితా గుప్తా నియామకానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్న సమయంలో వనితా గుప్తా న్యాయశాఖలోని పౌరహక్కుల విభాగంలో పనిచేశారు. తాజాగా బైడెన్ హయాంలోనూ ఆమె పనిచేయబోతుండటం గమనార్హం.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

First published:

Tags: America, Donald trump, International news, Joe Biden, NRI, NRI News

ఉత్తమ కథలు