H1B Visa- Joe Biden: హెచ్1బీ వీసాదారులకు పండగలాంటి వార్తను చెప్పిన జో బైడెన్.. ఇకపై వాళ్లందరికీ అమెరికా పౌరసత్వం..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ప్రతీకాత్మక చిత్రం)

అధికారంలోకి వచ్చిన తర్వాత జో బైడెన్ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. ఇందులో భాగంగానే దాదాపు ఐదు లక్షల మంది భారతీయులకు మేలు కలిగేలా ఓ కీలక చట్టాన్ని..

  • Share this:
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నారు. గతంలో ట్రంప్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను రద్దు చేస్తూ వస్తూనే, మరో వైపు ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారికి అమెరికా పౌరసత్వం ఇస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చేసిన హామీపై జో బైడెన్ దృష్టి సారించారు. ఆ హామీ అమలుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక అధారంగా తాజాగా ఓ బిల్లును అమెరికా సెనేట్ లో ప్రవేశ పెట్టారు. ఆ బిల్లునకు గురువారం యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. సెనేట్ లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో లక్షలాది మంది భారతీయులకు మేలు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    అమెరికాకు ప్రపంచ దేశాల నుంచి అక్రమంగా వచ్చిన వారి పిల్లలకు, సక్రమంగా వచ్చినప్పటికీ సరైన పత్రాలు లేని వారి పిల్లలకు, హెచ్1బీ వీసా ద్వారా అమెరికాకు వచ్చిన టెక్ నిపుణుల పిల్లలకు అమెరికా పౌరసత్వాన్ని అందించడమే తాజాగా అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టిన బిల్లు యొక్క ముఖ్యోద్దేశం. 228-197 ఓట్ల మెజార్టీతో ఈ బిల్లు సెనేట్ లో ఆమోదం పొందింది. దేశ వలస విధానంలో విప్లవాత్మక మార్పులను తెచ్చే దిశలో ఇది అత్యంత కీలక ఘట్టం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు అమెరికాలోనే ఉంటూ, అమెరికానే తమదిగా భావిస్తున్న వారికి సరైన రక్షణ ఇవ్వడం మన ప్రథమ కర్తవ్యం అంటూ జో బైడెన్ వ్యాఖ్యానించారు. వివిధ కారణాలతో అమెరికాకు వలస వచ్చిన వారి పిల్లలకు అమెరికా నిబంధనల ప్రకారం సరైన పత్రాలు ఉండవు. వారిని డ్రీమర్స్ అని పిలుస్తుంటారు. నిబంధనల ప్రకారం వీళ్లు అమెరికా పౌరులు కాదు. అమెరికా సర్కారు తమ పౌరులకు అందించే ఏ విధమైన పథకాలు వీరికి వర్తించవు. దీంతో వీరి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని, వీళ్ల కష్టాలను తీర్చి పౌరసత్వం అందించాలని జో బైడెన్ సర్కారు ముందుకొచ్చింది. తాజాగా ఓ బిల్లును సెనేట్ లో ప్రవేశ పెట్టి ఆమోదించింది.
    ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!
    Published by:Hasaan Kandula
    First published: