హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారికి మళ్లీ అవకాశం ఇవ్వనున్న చైనా

China: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారికి మళ్లీ అవకాశం ఇవ్వనున్న చైనా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Medical Students: ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటనకు కూడా వచ్చారు. ఈ సందర్భంగా మన ప్రభుత్వం చైనాలో మెడిసిన్ చదువుతున్న మన విద్యార్థుల ప్రస్తావన తీసుకొచ్చింది.

  రెండు సంవత్సరాలకు గడిచిన తరువాత చైనా కొంతమంది భారతీయ విద్యార్థులను తిరిగి చదువుకోవడానికి అనుమతించింది. దీని కోసం అవసరమైన సమాచారాన్ని విద్యార్థుల నుండి ఫారమ్‌లో కోరింది. చైనాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం దీనిపై స్పందించింది. మార్చి 25న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన తరువాత చైనాకు తిరిగి వచ్చే భారతీయ విద్యార్థులను సులభతరం చేయడానికి చైనా సుముఖత వ్యక్తం చేసింది. మే 8లోగా ఫారమ్‌ను పూరించడం ద్వారా సమాచారాన్ని అందించాలని సూచించింది. వైద్య విద్యను అభ్యసిస్తున్న 23,000 మంది భారతీయ విద్యార్థులను తిరిగి అనుమతించాలని భారత్ చైనాపై ఒత్తిడి తెచ్చింది.

  ఈ ప్రయత్నంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత నెలలో తన చైనా కౌంటర్ వాంగ్ యి న్యూ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు వివిధ చైనీస్ కళాశాలల్లో మెడిసిన్ చదువుతున్నారు. దీనిపై చైనా భారతదేశానికి హామీ ఇచ్చింది. దీనితో పాటు భారతీయ విద్యార్థులపై వివక్ష ఉండదని చైనా స్పష్టం చేసింది. వారి చదువులను తిరిగి ప్రారంభించడం రాజకీయ సమస్య కాదని పేర్కొంది. వాస్తవానికి 2019లో అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి చైనా నగరమైన వుహాన్‌లో విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా చైనాలోని మెడికల్ కాలేజీల్లో చదువుతున్న అనేకమంది విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.

  వారిలో భారత్‌కు సంబంధించిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ తరువాత విద్యార్థులు మళ్లీ ఎప్పుడు చైనాకు వెళ్లి తమ విద్యను కొనసాగిస్తారనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు భారత్, చైనా మధ్య కొంతకాలంగా క్రితం నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన విద్యార్థులు మళ్లీ చైనాకు వెళ్లి గతంలో మాదిరిగా చదువుకునే అవకాశం ఉంటుందా ? అనే అనుమానాలు పెరిగిపోయాయి. అయితే పరిస్థితులు మళ్లీ చక్కబడటం మొదలయ్యాయి.

  Bird Flu: మరో వ్యక్తికి బర్డ్‌ఫ్లూ కేసు.. మొదటిది చైనాలో.. రెండోది అమెరికాలో..

  Viral Video : మహాతల్లి..కళ్ల ముందు ఇల్లు తగలబడుతున్నా హాయిగా ఊయల ఊగుతోంది

  ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటనకు కూడా వచ్చారు. ఈ సందర్భంగా మన ప్రభుత్వం చైనాలో మెడిసిన్ చదువుతున్న మన విద్యార్థుల ప్రస్తావన తీసుకొచ్చింది. వారిని మళ్లీ చైనా వెళ్లి చదువుకునేలా పరిస్థితులు కల్పించాలని సూచించింది. దీనిపై చైనా సానుకూలంగా స్పందించింది. దీంతో త్వరలోనే విద్యార్థులు మళ్లీ తాము చదువుతున్న కాలేజీలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: China, Medical college

  ఉత్తమ కథలు