అమెరికాలో నివసిస్తున్న ఇండియన్- అమెరికన్స్‌కు గుడ్‌న్యూస్. గ్రీన్‌కార్డుల మంజూరులో ఒక్కో దేశానికి కేటాయించే కోటాను తొలగించడానికి రూపొందించిన బిల్లుకు వైట్‌హౌస్ సపోర్ట్ తెలిపింది. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే, అనేక మంది వలసదారులకు, ముఖ్యంగా ఇండో-అమెరికన్స్‌కు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యూఎస్ కంపెనీలకు మెరిట్ ఆధారంగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆయా దేశాల కోటాను దృష్టిలో ఉంచుకొని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డ్‌ను అధికారికంగా పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ అని కూడా పిలుస్తారు. అమెరికాకు వచ్చిన వలసదారులు అక్కడ శాశ్వతంగా నివసించాలంటే అక్కడి ప్రభుత్వం నుంచి గ్రీన్‌కార్డ్ పొందడం తప్పనిసరి.
తొమ్మిదేళ్ల పీరియడ్‌లో ఇంప్లిమెంటేషన్
ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ (EAGLE)-2022 యాక్ట్ బిల్లుపై ఓటు వేయడానికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఈ వారం షెడ్యూల్ చేసింది. ఈ ఈగల్ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే ఎంప్లాయిమెంట్- బేస్డ్ గ్రీన్ కార్డ్‌లపై ప్రతి దేశంపై ఉన్న పరిమితిని తొలగిస్తుంది. దీంతో భారతీయ వలసదారులకు మేలు జరగనుంది. అయితే ఈ మార్పులు తొమ్మిదేళ్ల పీరియడ్‌లో అమలు చేయనున్నారు. ఒక్కో దేశానికి పరిమితులు దశలవారీగా తొలిగిపోనున్నాయి. తక్కువ జనాభా గల దేశానికి చెందిన అర్హత గల వలసదారులపై ప్రభావం పడకుండా ఇంప్లిమెంట్ చేయనున్నారు.
నర్సులు, ఫిజికల్ థెరపిస్ట్‌లకు వీసాలు
తొమ్మిదేళ్ల కాలంలో.. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అత్యవసర సేవల కోసం నర్సులు, ఫిజికల్ థెరపిస్ట్‌లకు వీసాలు మంజూరు చేస్తామని వైట్‌హౌస్ పేర్కొంది. అంతేకాకుండా ఎంప్లాయిమెంట్- బేస్డ్ వలసదారులకు, ప్రస్తుతం యూఎస్‌లో లేని వారి కుటుంబ సభ్యులకు కూడా వీసాలు కేటాయించనున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. రెండేళ్లుగా ఇమ్మిగ్రెంట్ వీసా బ్యాక్‌లాగ్‌లో వేచి ఉన్న వ్యక్తులు తమ గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను ఫైల్ చేయడానికి అనుమతించే ముఖ్యమైన నిబంధనలు కూడా ఈ బిల్లులో ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది. అంతేకాకుండా వలసదారుల వీసా వ్యవస్థను మెరుగుపరచడానికి, వారికి వీసా మంజూరులో కఠినమైన నిబంధనలు తగ్గించడానికి అమెరికా అడ్మినిస్ట్రేషన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వైట్ హౌస్ పేర్కొంది.
చట్టపరమైన చిక్కుల్లో ఉన్నవారికి ఊరట
ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీల్ మఖిజా మాట్లాడుతూ.. గ్రీన్ కార్డ్‌ల కోసం లక్షలాది మంది వలసదారులు ఎదురుచూస్తున్నారని అన్నారు. అయితే ప్రస్తుతం చట్టపరమైన చిక్కుల్లో కూరుకుపోయిన వలసదారులకు ఈగల్ చట్టం వారి జీవితాన్ని మార్చేస్తుందని మఖిజా అభిప్రాయపడ్డారు.
తాత్కాలిక వీసాలు కూడా పొందవచ్చు
సాధారణంగా వీసా అందుబాటులోకి వచ్చే వరకు దరఖాస్తులను అప్రూవ్ చేయరు. అయితే ఈగల్ బిల్లు ఎంప్లాయిమెంట్ బేస్డ్ వలసదారులు తాత్కాలిక వీసాల పొందడానికి అవకాశం కల్పిస్తుంది. దీంతో వలసదారులు ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ప్రారంభించడంలో అదనపు సౌలభ్యాన్ని పొందవచ్చని వైట్‌హౌస్ పేర్కొంది. అంతేకాకుండా ఎంప్లాయిమెంట్ బేస్డ్ వలసదారుల పిల్లలు డిపెండెంట్ హోదా వయసు దాటిపోకుండా లేదా గ్రీన్‌కార్డ్ కోసం వారి అర్హతను కోల్పోకుండా చూసుకోవడం ద్వారా వారి కుటుంబాలను కలిపి ఉంచుతుందని వైట్ హౌస్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Greencard, International news, USA