Home /News /international /

GOLDEN BLOOD DO YOU KNOW ABOUT WORLDS RAREST GOLDEN BLOOD GROUP ONLY 45 PEOPLE LIVE WITH THIS SK

Golden Blood: ప్రపంచంలోనే చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ ఇది.. ప్రతి చుక్క బంగారం కన్నా విలువైనది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Golden Blood Group: అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో ఇప్పటి వరకు 45 మందిలోనే గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు కొంత కాలం పాటు తమ రక్తాన్ని బ్లడ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తూనే ఉంటారు. కానీ దానిని ఇతరులకు ఇవ్వరు.

    ఒక మనిషి సజీవంగా ఉండాలంటే శరీరంలో ఎన్నో రకాల జీవక్రియలు సమన్వయంతో జరగాలి. మన శరీరంలోని ప్రతి భాగం కూడా ముఖ్యమైనదే. దాని పని అది సక్రమంగా చేసినప్పుడు మాత్రమే.. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలడు. అందుకే ఏ ఒక్క అవయవ పనిచేలేకపోయినా.. మనం అనారోగ్యానికి గురవుతాం. మానవ దేహాన్ని దేవుడు అలా రూపొందించాడు. మానన శరీరంలో అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం. ఊపిరితిత్తులోని గాలి నుంచి ఆక్సిజన్‌ (Oxygen)ను సేకరించి.. శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు శరీరంలో ఉత్పత్తైన కార్భన్ డయాక్సైడ్‌ను కూడా కణాల నుంచి తొలగిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. ఐతే మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు ( Human Blood Groups) కనిపిస్తాయి. A, B, AB, O పాజిటివ్.. అలాగే నెగెటివ్ గ్రూప్స్ ఉంటాయి.

    OMG: ఇంత పొడవైన అరటి పండ్లను మీరెప్పుడూ చూసి ఉండరు.. అచ్చం సొరకాయల్లా..

    ఇవేవీ కాకుండా ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంది. అది చాలా అరుదుగా (Rare Blood group on Earth) ఉంటుంది. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ గురించి చాలా మందికి దీని గురించి తెలియదు. అదే గోల్డెన్ బ్లడ్ (Golden Blood). ఈ గ్రూప్ రక్తం చుక్క ఖరీదు బంగారం కన్నా విలువైనది అనే ప్రచారం ఉంది. ఇది చాల తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తం కేవలం 45 మందిలో మాత్రమే దీనిని గుర్తించారు. అందుకే ఇది చాలా విలువైనదిగా పేర్కొంటారు. ఈ బ్లడ్ గ్రూప్‌ గురించి మరిన్ని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

    Siricilla: పెళ్లైన ఓ ఆంటీ బ్యాచిలర్‌ని ప్రేమించింది..కలిసి బ్రతకలేమనుకొని..ఆ పని చేసింది

    గోల్డెన్ బ్లడ్ గ్రూప్ పేరు... Rh నల్ బ్లడ్ (Rh null Blood). ఇది చాలా అరుదుగా ఉంటుంది. అందుకే దీనిని గోల్డెన్ బ్లడ్ అని పిలుస్తారు. అందుకే దీనిని బంగారు రక్తం అని పిలుస్తారు. ఈ రక్తాన్ని అంటే ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా ఎక్కింవచ్చు. ఒకరి బ్లడ్ గ్రూప్ O అయినా, A అయినా.. వారికి గోల్డెన్ బ్లడ్ అందించవచ్చు. Rh ఫ్యాక్టర్‌ సున్నా ఉండే వ్యక్తుల్లో ఈ రకమైన బ్లడ్ ఉంటుంది. Rh ఏంటని అనుకుంటున్నారా? ఇది ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే ఒక రకమైన ప్రోటీన్. సాధారణ మానవ శరీరంలో ఈ Rh పాజిటివ్ లేదా నెగెటివ్‌గా ఉంటుంది. కానీ వీరి శరీరంలో మాత్రం పాజిటివ్‌గా ఉండదు.. నెగెటివ్‌గా ఉంటుంది. నల్.. అంటే సున్నాగా ఉంటుంది.

    OMG: ఇదేంటో తెలుసా? 100శాతం మంది ఫెయిల్.. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు

    గోల్డెన్ బ్లడ్ ఉన్న సాధారణ వ్యక్తుల్లా ఆరోగ్యంగా ఉండలేదరు. వారిలో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. వీరి రక్తంలో యాంటి జెన్ ఉండదు. అందువల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ అరుదైన రక్తాన్ని ప్రపంచంలోని 45 మంది వ్యక్తుల శరీరంలో మాత్రమే గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు కొంత కాలం పాటు తమ రక్తాన్ని బ్లడ్ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తూనే ఉంటారు. కానీ దానిని ఇతరులకు ఇవ్వరు. ఇది చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంటుంది. అందుకే ఎవరికీ ఇవ్వరు. ఈ రక్తాన్ని మళ్లీ అదే వ్యక్తికి అవసరమైనప్పుడు బ్లడ్ బ్యాంకులు ఇస్తుంటాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Science, Trending

    తదుపరి వార్తలు