గోల్డ్ టాయిలెట్ చోరీ... ఎవరు ఎత్తుకుపోయారో...

Gold Toilet : దాదాపు రూ.9 కోట్ల లావెటరీ... బ్లెన్‌హెయిమ్ ప్యాలెస్ నుంచీ మాయమైంది. పోలీసులు ఏమంటున్నారు?

Krishna Kumar N | news18-telugu
Updated: September 15, 2019, 8:16 AM IST
గోల్డ్ టాయిలెట్ చోరీ... ఎవరు ఎత్తుకుపోయారో...
బంగారు టాయిలెట్ (Image : Twitter - Sotiri Dimpinoudis)
  • Share this:
బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పుట్టిన చోట... 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను తెల్లవారుజాము 5 గంటలకు ఎవరో ఎత్తుకుపోయారు. ఈ టాయిలెట్‌ను ఆర్టిస్ట్ మారీజియో కాట్టెలాన్... పూర్తిగా బంగారంతో తయారుచేశాడు. ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని వుడ్‌స్టాక్‌లో ఉన్న బ్లెన్‌హెయిమ్ ప్యాలెస్‌ నుంచీ పోలీసులకు కాల్ వెళ్లింది. అక్కడి ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన కోసం ఉంచిన టాయిలెట్‌ చోరీ అయ్యిందని తెలిసింది. ఐతే... ఎగ్జిబిషన్‌లో ఉన్న టాయిలెట్‌ను ఎత్తుకుపోయిందెవరు అన్నది పోలీసులకు ఇంకా కచ్చితంగా తెలియలేదు. 66 ఏళ్ల ఓ ముసలాయనను అరెస్టు చేశారు. చోరీ జరిగిన చోట ఇంకా చాలా వస్తువులు పాడయ్యాయి. చిత్రమేంటంటే... ఆ బంగారు టాయిలెట్ పేరు అమెరికా. న్యూయార్క్‌లో దాన్ని ప్రదర్శనకు పెట్టినప్పుడు... పెద్ద సంఖ్యలో జనం దాన్ని చూసేందుకు వచ్చారు.

విన్‌స్టన్ చర్చిల్ పుట్టిన ప్రదేశంలో... బ్లెన్‌హెయిమ్ ప్యాలెస్‌లో చెక్కతో తయారుచేసిన గదిలో... ఆ టాయిలెట్‌ను సెట్ చేశారు. అలాంటి చాలా విలువైన వస్తువులు ఎగ్జిబిషన్‌లో ఉన్నాయన్న నిర్వాహకులు... వాటిని చూసేందుకు ప్రజలు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చోరీకి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే చెప్పాలని పోలీసులు కోరారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>