Gold Mine Accident:  విషాదం.. బంగారం గని కూలి 50 మంది మృతి

బంగారు గని కూలిన ఘటనలో దాదాపు 50 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్టుగా ఓ స్థానిక ఎన్‌జీవో వెల్లడించింది.

news18-telugu
Updated: September 12, 2020, 2:05 PM IST
Gold Mine Accident:  విషాదం.. బంగారం గని కూలి 50 మంది మృతి
ఫైల్ ఫొటో
  • Share this:
Gold Mine Accidentడెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలిన ఘటనలో దాదాపు 50 మంది మరణించారు. కాంగో తూర్పు ప్రాంతంలోని కమితుగ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్టుగా ఓ స్థానిక ఎన్‌జీవో వెల్లడించింది.
గని ఒక్కసారిగా కుప్పకూలడంతో చాలా మంది కార్మికులు లోపలే చిక్కుకుని మరణించారని.. బయటకు వచ్చే ఆస్కారం లేకుండా పోయినట్టుగా తెలుస్తోంది.

దేశంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి అనుమతులు ఉన్న కెనడియన్ మైనర్ బాన్రో కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ప్రమాదం జరిగిన గని లేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన గనిలో అక్రమ తవ్వకాల జరుపుతున్నట్టుగా చెప్పారు. కాగా, ప్రతి ఏడాది బంగారు గనుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. అక్రమంగా నిర్వహిస్తున్న గనుల్లో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బంగారం అన్వేషణలో భాగంగా భూమిలోకి చాలా లోతుగా వెళ్లడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
Published by: Sumanth Kanukula
First published: September 12, 2020, 1:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading