Gold Mining Accident: బంగారు గనిలో తవ్విన కొద్దీ శవాలు..

దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కమిటుంగా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో.. 50 మంది చనిపోయినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే మృతులు సంఖ్య అంతకంటే క్కువగాఎనే ఉండొచ్చని సమాచారం.

news18-telugu
Updated: September 13, 2020, 11:07 AM IST
Gold Mining Accident: బంగారు గనిలో తవ్విన కొద్దీ శవాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన బంగారు గని ప్రమాద దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కమిటుంగా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే మృతులు సంఖ్య అంతకంటే క్కువగానే ఉండొచ్చని సమాచారం. సహాయచర్యలు చేపడుతున్న సమయంలో తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి.

ఈ ఘటనపై కివు ప్రావిన్స్‌ గవర్నర్ స్పందిస్తూ.. ఈ దుర్ఘటనలో మొత్తం 50 మంది చనిపోయారని.. అందులో చాలా మంది యువకులే ఉన్నారని చెప్పారు. అయితే భాదితులు ఎంతమంది అనేదానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. బంగారు గని టన్నెల్స్‌లోకి పెద్ద మొత్తం వరద నీరు చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిపారు.

ఈ ప్రమాదంపై కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్‌ త్సిసెకొడి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, అయితే ప్రమాదం జరిగిన గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Published by: Sumanth Kanukula
First published: September 13, 2020, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading