GIRLS BRAS AND UNDER WEARS DISAPPEARING IN NIGHT TIME VIDEOS GOES VIRAL HERE IS INTERESTING STORY SK
OMG: గర్ల్స్ హాస్టల్లో కలకలం.. రాత్రిళ్లు అమ్మాయిల అండర్‌వేర్స్ మాయం.. వీడియో వైరల్
ప్రతీకాత్మక చిత్రం
OMG: హాస్టల్లో చాలా మంది యువతుల లోదుస్తులు కనిపించడం లేదు. మిగతా దుస్తులన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ అండర్వేర్లు మాత్రమే అదృశ్యమవుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు.
ఓ గర్ల్స్ హాస్టల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాత్రైతే చాలు అమ్మాయిల అండర్వేర్లు మాయమవుతున్నాయి. ఉతికి బయట ఆరేసిన ఆ లో దుస్తులు.. తెల్లారేసరికి కనిపించడం లేదు. మొదట ఒక అమ్మాయికి ఇలా జరిగింది. అమె తన సహచర విద్యార్థులతో చెబితే.. వారు లైట్ తీసుకున్నారు. గాలికి కొట్టుకుపోయి ఉంటుందిలే అని సర్దిచెప్పారు. కానీ ఆ తర్వాత మరో అమ్మాయికి... ఆ తర్వాత మరికొంత మందికి ఇలానే జరిగింది. అలా చాలా మంది యువతుల లోదుస్తులు కనిపించడం లేదు. మిగతా దుస్తులన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ బ్రాలు, అండర్వేర్ (Women underwear)లు మాత్రమే అదృశ్యమవుతున్నాయి. అసలు హాస్టల్లో ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మరి ఆ లో దుస్తులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు హాస్టల్లో ఏం జరుగుతోంది?
మలేసియా (Malaysia)లోని టెరెంగానులో ఉన్న పబ్లిక్ యూనివర్సిటీలో జరిగిందీ ఘటన. అక్కడ ఓ గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల లో దుస్తులు మాయమవుతున్నాయి. ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మందికి ఇలాంటి అనుభవం ఎదురయింది. ఐతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసునేందుకు కొందరు అమ్మాయిలు హాస్టల్ క్యాంపస్‌లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో జనవరి 25న రాత్రి సమయంలో ఓ వ్యక్తి గర్ల్స్ హాస్టల్ ప్రాంగణంలోకి వచ్చాడు. అక్కడ తచ్చాడుతూ ఉండగా హాస్టల్ విద్యార్థినులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని వీడియో తీయడం ప్రారంభించారు. ఐతే అతడు ఆరుబయట తీగలపై ఆరేసి ఉన్న అమ్మాయిల లోదుస్తులను దొంగిలిస్తూ (Women's Underwear Robbery)కనిపించాడు. ఆ తతంగం మొత్తం వీడియోలో రికార్డయింది. ఇన్నాళ్లు తమ లో దుస్తులు ఎక్కడికి వెళ్తున్నాయో.. హాస్టల్ విద్యార్థినులకు అప్పుడు అర్ధమయింది. తమ బ్రా, అండర్వేర్లను ఎత్తుకెళ్తున్నది ఇతడే అని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు లేడీస్ హాస్టల్‌కు వెళ్లి నిందితుడి (Underwear Thief)ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వయసు 37 ఏళ్లు. దొంగతనం కింద కేసులు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టారు. అతడికి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. ఐతే అతడు అమ్మాయిల అండర్ వేర్స్ ఎత్తుకెళ్లి వాటిని తాకుతూ శృంగార అనుభూతి పొందేవాడని పోలీసులు తెలిపారు.
కాగా, అతడు లో దుస్తులను తీస్తున్న వీడియోను కొందరు హాస్టల్ విద్యార్థినులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది వైరల్ అయింది. ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ఇలాంటి దొంగలు కూడా ఉంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు చోరీ చేస్తారు.. బంగారం ఎత్తుకెళ్తారు.. వీడేంటి తేడాగా ఉన్నాడు.. ఆడవారి లో దుస్తులు ఎత్తుకెళ్లడం ఏంటి? అని జోకులు పేల్చుతున్నారు. వీడు ఖచ్చితంగా మానసిక రోగి.. చికిత్స అవసరం అని మరికొందరు కామెంట్ చేశారు. అయ్యో.. అతడు ఇంత అమాయకుడేంటి? అని మరికొందరు సానుభూతి చూపించారు. మొత్తానికి ఈ లో దుస్తుల దొంగ మాత్రం మలేసియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.