హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

300 గుంజీళ్లు తీయాలని పనిష్‌మెంట్.. టీచర్ అలా చేయించేసరికి పాపం ఆ బాలిక జీవితంలో..

300 గుంజీళ్లు తీయాలని పనిష్‌మెంట్.. టీచర్ అలా చేయించేసరికి పాపం ఆ బాలిక జీవితంలో..

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లలో కొందరు చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు చేసే కొన్ని అల్లరి పనులకు సైతం వారిని శిక్షిస్తున్నారు.

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లలో కొందరు చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు చేసే కొన్ని అల్లరి పనులకు సైతం వారిని శిక్షిస్తున్నారు.

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లలో కొందరు చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు చేసే కొన్ని అల్లరి పనులకు సైతం వారిని శిక్షిస్తున్నారు.

  పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లలో కొందరు చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు చేసే కొన్ని అల్లరి పనులకు సైతం వారిని శిక్షిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిపై పలు సందర్బాల్లో పిల్లల తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ఓ టీచర్ ఇచ్చిన పనిష్‌మెంట్ కారణంగా ఓ విద్యార్థిని శాశ్వత అంగవైకల్యం పొందింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాలు.. చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని (Sichuan Province) హై స్కూళ్లో చదివే 14 ఏళ్ల విద్యార్ధిని వసతి గృహంలో ఆమె బెడ్ పక్కన స్నాక్స్ ఉన్నట్టుగా టీచర్ గుర్తించింది. వాటి గురించి బాలికను ప్రశ్నించింది. అయితే బాలిక అవి తనవి కావని చెప్పింది. దీంతో టీచర్ ఆవేశంలో బాలికకు పనిష్‌మెంట్ ఇచ్చింది. 300 గుంజిళ్లు తీయమని చెప్పింది. ఆమెకు పనిష్‌మెంట్ విధించిన టీచర్.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిక పనిష్‌మెంట్ సరిగా పూర్తి చేస్తుందా..? లేదా.. అనేది చూసే బాధ్యతను మరో టీచర్‌కు అప్పగించింది.

  అయితే ఆ బాలిక గతేడాది ఏప్రిల్ నుంచి కాలి గాయంతో బాధపడుతుంది. ఈ విషయం తెలిసిన వారు కూడా బాలిక విధించిన పనిష్‌మెంట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో 150 గుంజిళ్లు తీశాక, బాలిక పరిస్థితి విషమించడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఇక మీదట మామూలుగా నడవలేదని, కర్రల సాయంతోనే నడవాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఆ బాలిక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన మెడిసిన్ కూడా వాడుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాలిక తల్లి జోహు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన జూన్ 10వ తేదీ రాత్రి 10 గంటలకు చోటుచేసుకుందని తెలిపింది.

  Gang rape In Train: మరో నిర్భయ.. కదులుతున్న రైలులో యువతిపై సామూహిక అత్యాచారం


  బాలిక పరిస్థితి గురించి తెలుసుకున్న స్కూల్ యజమాన్యం.. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న టీచర్లను, సిబ్బందిని వెంటనే విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు కూడా ఆదేశించింది. అంతేకాకుండా బాలికకు రూ. 13 లక్షలు నష్టపరిషారం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. అయితే ఆ పరిహారం తీసుకోవడానికి బాలిక తల్లిదండ్రులు నిరాకరించినట్టుగా సమాచారం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  Teacher - Student: ఫీలింగ్స్ చెప్పాలని బాలుడికి మెసేజ్.. కారులోనే పలుమార్లు లైంగిక దాడి.. బాలుడి సోదరికి..


  పిల్లలకు ఇలాంటి పనిష్‌మెంట్ ఇచ్చిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల మంచిగా ఉండే టీచర్లకు కూడా చెడ్డపేరు వస్తుందని అంటున్నారు.

  First published:

  Tags: China

  ఉత్తమ కథలు