Argentina : దక్షిణ అమెరికాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఘటన అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కలకలం రేపింది. ఓ మహిళా పేషెంట్ చనిపోయిన తర్వాతి రోజు.. అదే పేషెంట్‌తో ఆస్పత్రి సిబ్బంది మాట్లాడిన వీడియో అది. అందులో ఆ పేషెంట్ కనిపించట్లేదు. అదే ఆ వీడియోని వైరల్ చేసింది. దెయ్యం పేషెంట్ అనే పేరుతో ఈ వీడియో వైరల్ అవుతోంది. బ్యూనస్ ఎయిర్స్లో ఆ ఆస్పత్రి ఉంది. అందులోని సెక్యూరిటీ గార్డ్.. ఎవరితో మాట్లాడాడన్నది ఆశ్చర్యంగా మారింది.
వీడియోని గమనిస్తే.. ఆస్పత్రి రిసెప్షన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఇంతలో ఎవరో ఆస్పత్రిలోకి వచ్చినట్లు అతను చూశాడు. వెంటనే తన సీటు లోంచీ లేచి.. నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఎవరితోనో మాట్లాడాడు. ఆ తర్వాత డాక్టర్ క్యాబిన్ ఎక్కడ ఉందో చేతితో చూపించాడు. ఆ తర్వాత.. డాక్టర్ క్యాబిన్ దగ్గరకు వెళ్లేందుకు ఓ చక్రాల కుర్చీని తీసి.. వచ్చిన వ్యక్తికి ఇస్తున్నట్లు వీడియో ఉంది. ఆ చక్రాల కుర్చీలో కూర్చోమని సెక్యూరిటీ గార్డు సూచిస్తున్నాడు.
ఈ వీడియోలో ఎక్కడా కూడా రెండో వ్యక్తి కనిపించలేదు. మరి ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎవరితో మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? అతని దగ్గరకు వచ్చింది ఎవరు? అనేది మిస్టరీగా మారింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఆ వచ్చిన వ్యక్తి పేరును ఆ సెక్యూరిటీ గార్డు తన రిజిస్టర్లో రాసుకున్నాడు. ఆమె ఓ మహిళ. ఆమె ముందురోజే అదే ఆస్పత్రిలో చనిపోయింది. మరి చనిపోయిన ఆమె.. అతని దగ్గరకు ఎలా వచ్చింది? అనేది మిస్టరీగా మారింది.
TTD : భక్తులకు టీటీడీ సూచన .. సర్వదర్శనం టికెట్లపై తాజా ప్రకటన
ఆస్పత్రి స్పందన:
ఆస్పత్రిలోని మీడియా రిలేషన్స్ డైరెక్టర్ గుయిలెర్మో గపుయా.. దీనిపై స్పందించారు. ఆస్పత్రి ఎంట్రన్స్ డోర్‌కి సమస్య ఉందనీ.. అది 10 గంటల సమయంలో 28 సార్లు ఓపెన్ అయ్యిందని చెప్పారు. ఇందులో ఏ దెయ్యమూ లేదని అన్నారు. ఇక సెక్యూరిటీ గార్డ్ అలా ప్రవర్తించడం అనేది జోకే తప్ప నిజం కాదని ఆస్పత్రి సిబ్బంది అంటున్నారు. అతను మరో కంపెనీకి చెందిన వాడని చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియో నెటిజన్లను భయపెడుతోంది.
ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
ఇది చూసిన కొంతమంది గార్డ్ ప్రాంక్ చేశాడనీ.. ఏ దెయ్యమూ లేదని అంటున్నారు. మరికొందరు అతను కొత్తగా వచ్చి ఉంటాడనీ.. అందుకే రిహార్సల్స్ చేస్తున్నాడని అంటున్నారు. రిజిస్టర్లో మహిళ పేరు రాశాడా అన్నది కూడా క్లారిటీ లేదు. మొత్తంగా సోషల్ మీడియాలో ఈ వీడియోపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానిజాలు స్పష్టంగా తెలియకపోయినా.. చూసేవాళ్లు మాత్రం భయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Trending, Viral, Viral Video