Home /News /international /

GERMANY LIKELY TO SEND COBRA COUNTER ARTILLERY RADAR TO KYIV UKRAINE TO GET WORLDS MOST ADVANCED WEAPON LOCATING SYSTEM GH VB

Ukraine-Germany: ఉక్రెయిన్ కు పెరుగుతున్న మద్దతు.. కీవ్‌కు కోబ్రా కౌంటర్-ఆర్టిలరీ రాడార్‌ను అందించనున్న జర్మనీ..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జర్మనీ(Germany) ఉక్రెయిన్‌కు(Ukraine) కోబ్రా కౌంటర్-ఆర్టిలరీ రాడార్‌ను(Radar) సరఫరా చేస్తున్నట్లు జర్మన్(German) వార్తాపత్రిక వెబ్‌సైట్ 'వెల్ట్'లో కథనం వెలువడింది. కోబ్రా ప్రపంచంలోనే అత్యంత అధునాతన ల్యాండ్‌ బేస్డ్ వెపన్‌ లొకేటింగ్‌ సిస్టమ్‌.

ఇంకా చదవండి ...
జర్మనీ(Germany) ఉక్రెయిన్‌కు(Ukraine) కోబ్రా కౌంటర్-ఆర్టిలరీ రాడార్‌ను(Radar) సరఫరా చేస్తున్నట్లు జర్మన్(German) వార్తాపత్రిక వెబ్‌సైట్ 'వెల్ట్'లో కథనం వెలువడింది. కోబ్రా ప్రపంచంలోనే అత్యంత అధునాతన ల్యాండ్‌ బేస్డ్ వెపన్‌ లొకేటింగ్‌ సిస్టమ్‌. కౌంటర్ బ్యాటరీ రాడార్ కోసం కోబ్రాను థేల్స్, ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్, లాక్‌హీడ్ మార్టిన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జర్మన్, ఫ్రెంచ్, బ్రిటిష్ సాయుధ దళాల కోసం కోబ్రా కౌంటర్-ఆర్టిలరీ రాడార్ తయారీ.. 2005లో ఈ సేవలు మొదలయ్యాయి.

కోబ్రా రాడార్ ఎందుకు ప్రాణాంతకం..?
దీనికి అధిక-పనితీరు గల రాడార్ తో పాటు.. అధునాతన ప్రాసెసింగ్, ఇంటిగ్రేటెడ్ & ఫ్లెక్సిబుల్ కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటుంది. డిజైన్‌లో ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డిజిటల్ ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ యాక్టివ్, సాలిడ్-స్టేట్ ఫేజ్డ్ అర్రే యాంటెన్నా ఉన్నాయి. కోబ్రా లక్ష్యం మోర్టార్లు, రాకెట్ లాంచర్లు, ఫిరంగి బ్యాటరీలను గుర్తించడం, వాటి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సమాచారాన్ని అందించడం. 100 కి.మీ రేంజ్‌ కలిగిన కోబ్రా , రెండు నిమిషాల్లో 40 బ్యాటరీలను గుర్తించి వర్గీకరించగలదు. శాంతి పరిరక్షణ విధుల్లో మోహరించినప్పుడు కాల్పుల విరమణ ఉల్లంఘనలను కూడా పర్యవేక్షించగలదు. ఉక్రెయిన్‌కు 7 PzH 2000 155mm హోవిట్జర్‌లను అందజేస్తామని జర్మనీ ముందుగా ప్రకటించిన అనంతరం వచ్చిన తాజా ప్రకటన ఇది. PzH 2000 అనేది జర్మన్ కంపెనీలు క్రాస్-మాఫీ వెగ్‌మాన్ (KMW)అభివృద్ధి చేసిన జర్మన్ 155 mm సెల్ఫ్‌ ప్రొపెల్లెడ్‌ హోవిట్జర్ లు. ట్రాక్డ్‌ ఆర్మర్డ్ చట్రంపై అన్ని భూభాగ పరిస్థితులలో హై మొబిలిటీ అందించే సామర్థ్యమున్న హోవిట్జర్ . దీనిద్వారా చిన్న ఆయుధాలు, ఫిరంగి షెల్ స్ప్లింటర్ల నుంచి సిబ్బందికి రక్షణ కలుగుతుంది. PzH 2000 ప్రపంచంలోని అత్యంత ఆధునిక సెల్ఫ్‌ ప్రొపెల్లెడ్‌ చోదక హోవిట్జర్‌.

Russia: మాస్కో సమీపంలో కనిపించిన పుతిన్ 'డూమ్‌ డే' విమానం.. ఆందోళనలో పశ్చిమ దేశాలు.. కారణం ఏంటంటే..


PzH 2000 సేవలందిస్తున్న దేశాలు విషయానికి వస్తే.. క్రొయేషియా, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఇటలీ, లిథువేనియా, నెదర్లాండ్స్, ఖతార్ మరియు ఉక్రెయిన్ ఉన్నాయి. హోవిట్జర్ అన్ని ప్రామాణిక NATO 155 mm మందుగుండు సామగ్రిని కాల్చగలదు. గరిష్టంగా నిమిషానికి 9 రౌండ్ల కాల్పులు జరిపే సత్తా దీని సొంతం. దీనికి ప్రామాణిక HE-FRAG (హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్) ప్రొజెక్టైల్స్‌తో గరిష్టంగా 30 కి.మీ, ఎక్స్‌టెండెడ్‌ ప్రొజెక్టైల్స్‌తో 40 కి.మీ.ల రేంజ్‌ ఉంటుంది. ఏడు Panzerhaubitze 2000 లాంగ్-రేంజ్ ఆర్మర్డ్ హోవిట్జర్‌లను ఉక్రెయిన్‌కు పంపే ప్రతిపాదనను జర్మనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బెర్లిన్ ఉక్రెయిన్‌కు 50 గెపార్డ్ ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్ డెలివరీని ఆమోదించనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఉక్రెయిన్‌కు సైనిక సహాయంలో భాగంగా యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ ట్యాంకులను అందించడానికి జర్మనీ కట్టుబడి ఉంది.

జర్మనీ ఆయుధాల పాలసీని ఉక్రెయిన్‌కి ఎలా మార్చింది..?
కీవ్‌కు ఆయుధాలను అందించడానికి మొదట్లో ప్రతిఘటించిన జర్మనీ, మానవతా సహాయం, వైద్య పరికరాలను అందజేసింది. ఉద్రిక్తలున్న జోన్‌కు మారణాయుధాలను సరఫరా చేయకూడదనే జర్మనీ దశాబ్దాల విధానం. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి కొన్ని నెలల ముందు, తన సంకీర్ణ ఒప్పందంలో నిర్బంధ ఆయుధాల ఎగుమతి విధానాన్ని చేర్చడానికి జర్మనీ అంగీకరించింది. మిత్రదేశాలు, జర్మన్ ప్రజల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రభుత్వం నిబంధనలను సరిదిద్దింది. ఫిబ్రవరి చివరి నాటికి, ఉక్రెయిన్‌కు జర్మనీ కొన్ని 'రక్షణ' ఆయుధాలను అందించడం ప్రారంభిస్తుందని స్కోల్జ్ ప్రకటించాడు. జర్మనీ సొంత సైన్య అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చిస్తుందని జర్మన్ ఛాన్సలర్ ప్రకటించాడు.
Published by:Veera Babu
First published:

Tags: Germany, Radar, Russia-Ukraine War

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు