ఇతర దేశాలకు వలస వెళ్లడం అక్కడి పౌరసత్వం(Citizenship) తీసుకుని సెటిల్ అవ్వడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. మెరుగైన లైఫ్‌స్టైల్(Lifestyle) కోసం చాలామంది ఇతర దేశాలకు షిఫ్ట్(Shift) అవుతున్నారు. అందులోనూ జర్మనీ(Germany) అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మంచి లైఫ్‌స్టైల్, ఉచిత విద్య(Free Education), ఆరోగ్యం(Health), యూరోప్ కల్చర్.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చాలామంది జర్మనీకి మైగ్రేట్ అవుతున్నారు. అయితే జర్మనీ పౌరసత్వం పొందడం అంత ఈజీ కాదు. దానికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీలో నివసించేందుకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ముందుగా యూనివర్సిటీ సీటు సాధించడం ద్వారా చదువుకోవడం కోసం వెళ్లొచ్చు. లేదా జర్మనీలో ఉద్యోగం(Job) సంపాదించి పని చేయడం కోసం వెళ్లొచ్చు. ఇకపోతే టూరిస్ట్‌లాగా కూడా వెళ్లొచ్చు. కానీ టూరిస్ట్ వీసా మీద కొద్ది రోజులు మాత్రమే జర్మనీలో ఉండేందుకు అనుమతి ఉంటుంది.
Multibagger Stock: రూ.2 స్టాక్.. రూ.10వేల పెట్టుబడికి రూ.1.30 కోట్ల రాబడి.. ఇన్వెసర్లపై కో
ముందుగా జర్మనీ వీసా పొందడం కోసం జర్మన్ హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurence) తీసుకోవాలి. అలాగే మీ వీసా దరఖాస్తును సమయానికి సమర్పించాలి. జర్మనీ లాంటి దేశాలకు వీసా పొందాలంటే దానికి కొంత సమయం పడుతుంది. వీసా అప్లై చేసిన తర్వాత అది అప్రూవ్ (Approve) అవ్వడానికి ఒకటి నుంచి నాలుగు నెలల సమయం పట్టొచ్చు. అలాగే జర్మనీకి ఫ్లైట్ కూడా ముందుగానే బుక్ చేసుకొవడం ముఖ్యం. చదువు(Education) లేదా ఉద్యోగ రీత్యా జర్మనీలో నివసించడం కోసం ఇల్లు లేదా హాస్టల్ లాంటివి కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి. జర్మనీకి చేరుకున్నాక అక్కడ మీరు నివసిస్తున్నట్టు అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాలి. మీ అడ్రస్, చదువుతున్న యూనివర్సిటీ లేదా పనిచేస్తున్న కంపెనీ వివరాలు అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే మీకు బ్యాంక్ అకౌంట్, ఇంటర్నెట్ లాంటి వసతులు అందుతాయి. అలాగే జర్మనీలో మీరు జీతం తీసుకోవాలంటే మీకు జర్మన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అది కూడా ముందే ఏర్పాటు చేసుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా జర్మన్‌లో నివసించడం కోసం జర్మన్ భాష నేర్చుకోవడం అవసరం. జర్మనీలో ఉండడానికి జర్మన్ నేర్చుకోవాలన్న రూల్ ఏమీ లేదు. కానీ జర్మన్ నేర్చుకోవడం ద్వారా ఆ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.
Pension Scheme: ఈ స్కీమ్‌లో ఈరోజు చేరితే నెలకు రూ.9,250పెన్షన్ ఇచ్చే పథకం
జర్మనీలో నివసించేవాళ్లు కచ్చితంగా పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే..
1. స్థానిక జర్మన్ అధికారుల వద్ద మీ వివరాలు నమోదు చేసుకోవాలి.
2. మీ టెంపరరీ వీసాను రెసిడెంట్ వీసాగా మార్చుకోవాలి.
3. జర్మన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
4. జర్మన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి.
5. కొన్ని ఇతర ఇన్సూరెన్స్‌లు కూడా తీసుకోవాల్సి రావొచ్చు.
6. జర్మనీలో నివసించేందుకు ఒక అడ్రస్ ఏర్పాటు చేసుకోవాలి.
7. మీ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్లాన్ చేసుకోవాలి.
8. మీ పొరుగువారి గురించి, పరిసర ప్రాంతాల గురించి తెలుసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది.
9. జర్మన్ భాష నేర్చుకునేందుకు ఏదైనా బేసిక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ అవ్వడం మంచిది.
10. చివరిగా జర్మనీలో ప్రాంతాలను , అక్కడి కల్చర్‌ను అలవాటు చేసుకుంటే అక్కడి లైఫ్ బాగుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.