భారత్ (India), రష్యా (Russia) చిరకాల మిత్రులు అనే విషయం తెలిసిందే. అయితే అలాంటి రష్యాని భారత్ నుంచి విడగొట్టేందుకు యూరోపియన్ కంట్రీ జర్మనీ (Germany) రెడీ అయింది. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ (German Chancellor Olaf Scholz) రష్యాకు వ్యతిరేకంగా అతిపెద్ద అంతర్జాతీయ కూటమిని ఏర్పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చే నెలలో జరిగే గ్రూప్ ఆఫ్ సెవెన్ లీడర్స్ సమ్మిట్‌కు ప్రధాన అతిథి (Special Guest)గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే మోదీ ఓలాఫ్ ఆహ్వానం మేరకు జర్మనీలోని బెర్లిన్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు నాటికి జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మోదీని ఆహ్వానించే విషయంపై ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.
ఈసారి రొటేటింగ్ G-7 ప్రెసిడెన్సీని జర్మనీ హోల్డ్ చేస్తోంది. జూన్ 26 నుంచి జూన్ 28 వరకు బవేరియన్ ఆల్ప్స్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, సెనెగల్ నాయకులను కూడా రష్యా ఆహ్వానిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. స్కోల్జ్ బెర్లిన్‌లో చర్చలు, జర్మనీ-భారత్ సంయుక్త క్యాబినెట్ సమావేశానికి పీఎం మోదీని నేడు ఆహ్వానించారు. దీంతో ఈ రోజే శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించే విషయంపై తన నిర్ణయాన్ని స్కోల్జ్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.
ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్రను ఖండించేందుకు ప్రధాని మోదీ అయిష్టత చూపడంతో కొన్ని వారాల క్రితం వరకు మోదీ ఆహ్వానంపై స్కోల్జ్ నిర్ణయం తీసుకోలేదు. కానీ జర్మనీ ఛాన్సలర్ రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నాలలో భారతదేశాన్ని విలువైన భాగస్వామిగా జీ-7 సమావేశంలో ఉంచాలని నిర్ణయించారు. స్కోల్జ్ వాతావరణ మార్పు, రక్షణ వంటి ఇతర విధాన రంగాలలో పీఎం మోదీతో సన్నిహితంగా పని చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
జర్మనీ ప్రభుత్వం రాబోయే సంవత్సరాల్లో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని కోరుకుంటోంది. రష్యాతో ఇండియా తన సంబంధాలను పునరాలోచించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను యూరోపియన్ యూనియన్ అందిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలకు కూడా జర్మన్ మద్దతు ఇస్తోంది. ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో కార్మికుల కొరతను అధిగమించడంలో భారతీయ కార్మికులకు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత సులభతరం చేయడంపై సోమవారం సమావేశంలో స్కోల్జ్, పీఎం మోడీ చర్చిస్తారు. వాతావరణాన్ని దెబ్బతీసే కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారతదేశానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను ఎలా వేగవంతం చేయాలనే దానిపై కూడా మాట్లాడనున్నారు.
ఆయుధాలు కొనుగోలు విషయంలో కూడా ఇండియా రష్యా వైపు చూడకుండా చేసేందుకు జర్మనీ ప్రయత్నిస్తోంది. మాస్కోపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, రష్యా ఆయుధ డెలివరీలకు ప్రత్యామ్నాయంగా భారతదేశానికి ప్రత్యామ్నాయాన్ని అందించాలని యూరోపియన్ డిఫెన్స్ కంపెనీలను జర్మనీ కోరుతోంది. అయితే సోమవారం ఎలాంటి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉండకపోవచ్చు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత, స్కోల్జ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా ఉన్న దేశాలతో జర్మనీ రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలనుకుంటున్నారు. అందుకే గత వారం తన మొదటి ఆసియా పర్యటన కోసం జపాన్ను ఎంచుకున్నారు. అయితే స్కోల్జ్ కు ముందు పనిచేసిన ఛాన్సలర్లు తొలుత చైనాలోని వ్యాపార ప్రతినిధులను సందర్శించారు. కానీ స్కోల్జ్ జపాన్ను సెలెక్ట్ చేసుకొని ఆశ్చర్య పరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Germany, Modi, Pm modi, PM Narendra Modi, Russia, Russia-Ukraine War