హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine: రష్యాను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం.. ఉక్రెయిన్ కు సాయం అందిస్తోన్న జర్మనీ..

Russia-Ukraine: రష్యాను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధం.. ఉక్రెయిన్ కు సాయం అందిస్తోన్న జర్మనీ..

రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు రష్యా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ యుద్ధం చివరి దశకు మాత్రం చేరలేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దళాలకు మద్ధతుగా జర్మనీ ప్రయత్నాలు చేస్తోంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు రష్యా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ యుద్ధం చివరి దశకు మాత్రం చేరలేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దళాలకు మద్ధతుగా జర్మనీ ప్రయత్నాలు చేస్తోంది.

రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు రష్యా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ యుద్ధం చివరి దశకు మాత్రం చేరలేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దళాలకు మద్ధతుగా జర్మనీ ప్రయత్నాలు చేస్తోంది.

  రష్యా ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలు రష్యా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ యుద్ధం(War) చివరి దశకు మాత్రం చేరలేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దళాలకు మద్ధతుగా జర్మనీ(Germany) ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే జర్మనీ నుంచి ఉక్రెయిన్‌ కు 1,500 స్ట్రెలా మ్యాన్‌ప్యాడ్స్ (మ్యాన్-పోర్టబుల్ ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్), 100 MG3 తుపాకులు చేరాయి. ఉక్రెయిన్‌కు అందిన వాటిలో స్ట్రెలా మమ్యాన్‌ప్యాడ్‌లు స్ట్రెలా-2M 9K32 మోడల్ అయి ఉండొచ్చని రిపోర్ట్స్‌ వస్తున్నాయి. స్ట్రెలా-2M 9K32పై NATO కోడ్ SA-7B గ్రెయిల్-B.. పూర్వపు తూర్పు జర్మన్ సైన్యం నుంచి లభ్యం అయ్యామయి.

  స్ట్రెలా-2M 9K32 ఏంటి..?

  SA-7 శ్రేణిలో రష్యన్ డిఫెన్స్‌ ఇండస్ట్రీ తయారు చేసిన పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ మమిసైల్‌ సిస్టమ్‌లో రెండో తరానికి చెందినది స్ట్రెలా-2M 9K32. ఇది సింపుల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైల్‌ స్ట్రెలా-2 అభివృద్ధి 1959లో ప్రారంభం అయి.. 1966లో బేసిక్‌ వెర్షన్‌ లో సేవలు ప్రారంభించింది. 1971 నుంచి సేవలు అందిస్తున్న ఇన్‌ఫ్రా-రెడ్ హోమింగ్ సిస్టమ్‌ కలిగిన అధునాతన వెర్షన్ స్ట్రెలా-2M (SA-7B). ఎఫెక్టివ్‌ వార్‌హెడ్ , ఇంజిన్‌, న్యూ డిటెక్షన్‌ డివైజ్‌ దీని సొంతం. అధిక థ్రస్ట్ ప్రొపెల్లెంట్‌ను ఉపయోగించే SA-7Bకు స్లాంట్ పరిధిని 3.4 నుంచి 4.2 కిమీ , ఎత్తును 1.5 నుంచి 2.3 కిమీ వరకు పెంచే సామర్థ్యం ఉంది. న్యూ ఇంప్రూవ్డ్‌ గైడెన్స్‌, కంట్రోల్‌ లాజిక్‌ ద్వారా గరిష్ఠంగా 150 మీ/సె వేగంతో ఎగిరే విమానాల నుంచి దీనిని ప్రయోగిస్తారు.

  MG3 గన్‌ అంటే ఏంటి..?

  MG3 అనేది జర్మన్ జనరల్‌ పర్పస్‌ మెషిన్ గన్. 7.62×51mm NATO కాట్రిడ్జ్‌కు ప్రత్యేకం. 1950ల చివరలో మెషిన్ గన్ అభివృద్ధి చేసిన తర్వాత కొత్తగా ఏర్పడిన జర్మన్‌ ప్రత్యేక దళం బుండెస్‌వెహ్ర్‌కు అందజేశారు.ప్రస్తుతం స్క్వాడ్ సపోర్ట్ వెపన్‌, వెహికల్ మౌంటెడ్ మెషిన్ గన్‌గా కొనసాగుతోంది. MG3 అనేది ఆటోమేటిక్, ఎయిర్-కూల్డ్, బెల్ట్-ఫెడ్ షార్ట్ రీకోయిల్-ఆపరేటెడ్ తుపాకీ. ట్రైపాడ్‌పై లేదా 1,200 ట్రిపాడ్‌పై, కాంబ్యాట్‌ వెహికల్‌పై నుంచి 600 మీ దూరంలోని లక్ష్యాలను చేధించే శక్తి దీనికి ఉంది.

  ఇజ్రాయెల్‌ యాంటీ మిసైల్‌ సిస్టమ్‌ కొనుగోలు చేయనున్న జర్మనీ..

  ముందస్తుగా రష్యా దాడుల నుంచి రక్షణకు యాంటీ మిసైల్‌ సిస్టమ్‌ ను జర్మనీ కొనుగోలు చేయనుంది. తమ వద్ద ఉన్న పేట్రియాట్ బ్యాటరీల కంటే ఎక్కువ పరిధి కలిగిన యాంటీ మిసైల్‌ సిస్టమ్‌ కొనుగోలు చేసే యోచనలో జర్మనీ ఉన్నట్లు రిపోర్ట్స్‌. తమ ప్రయోజనాలను కాపాడేందుకు హింసకు కూడా సిద్ధపడుతున్న పొరుగుదేశం ఉందని తెలుసుకోవాలని జర్మన్‌ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్‌ అన్నారు. జర్మనీ డిఫెన్స్‌ చీఫ్ ఎబర్‌హార్డ్ జోర్న్‌తో ఓలాఫ్‌ భేటీలో జర్మనీ మొత్తానికి మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఉండాలనేదానిపై చర్చించారు.

  ఇజ్రాయెల్‌కు చెందిన డిఫెన్స్‌ సిస్టమ్‌ యారో 3 కొనుగోలుపై జోర్న్‌, ఓలాఫ్‌ చర్చించినట్లు సమాచారం. రెండు బిలియన్ యూరోలు ఖరీదు చేసే ఈ వ్యవస్థ, 2025 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రిపోర్ట్స్‌. జర్మనీలోని మూడు సైట్లలో ర్యాడార్‌ వ్యవస్థను ప్రారంభించే అవకాశం ఉంది. మానిటరింగ్‌ డేటా ఎప్పటికప్పుడు సైనికులు 24/7 పర్యవేక్షిస్తున్న సెంట్రల్‌ సైట్‌కు తరలింపు. యారో3 అనేది రాకెట్ దాడిని గుర్తించిన వెంటనే అంతరిక్షంలోకి మిసైల్‌ పంపి ధ్వంసంచేస్తుంది. చాలా శక్తివంతమైన రాడార్‌ వ్యవస్థతో పోలాండ్, రొమేనియా, బాల్టిక్ దేశాలకు కూడా రక్షణ ఇస్తోంది. జర్మనీ తమ డిఫెన్స్‌ బడ్జెట్‌ను ఆర్థిక ఉత్పత్తిలో 2 శాతానికి పెంచుతున్నట్లు స్కోల్జ్ ప్రకటించారు.

  జర్మనీ హిస్టారిక్‌ మూవ్‌..

  వివాదాస్పద ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేయకూడదనే జర్మనీ పాలసీలో ఇటీవల సవరణ చేశారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు ఆయుధాలను తరలించడానికి నిరాకరించిన జర్మనీపై మిత్రదేశాల ఆగ్రహంతో ఉన్నాయి. ఉక్రెయిన్‌కు హెల్మెట్‌లను పంపేందుకు సిద్ధపడిన జర్మనీని కొన్ని దేశాలు హేళన చేశాయి. అయినప్పటికీ ఫిబ్రవరి చివరలో 1,000 యాంటీ ట్యాంక్‌ వెపన్స్‌, 500 స్టింగర్‌ మిసైల్స్‌ను ఉక్రెయిన్‌కి పంపినట్లు జర్మనీ ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 400 రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ లాంచర్‌లను పంపాలని నెదర్లాండ్‌కు జర్మనీ ప్రభుత్వం సూచించింది.

  First published:

  Tags: Germany, Russia, Russia-Ukraine War

  ఉత్తమ కథలు