సీఏఏ నిరసనల్లో పాల్గొన్న జర్మన్ విద్యార్థి వీసా కేన్సిల్...స్వదేశం వెళ్లిపోవాలని ఆదేశం...

జాకోబ్ ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ షాక్ తో ఇండియా విడిచి వెళ్తున్నట్టు జాకోబ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.


Updated: December 24, 2019, 11:00 PM IST
సీఏఏ నిరసనల్లో పాల్గొన్న జర్మన్ విద్యార్థి వీసా కేన్సిల్...స్వదేశం వెళ్లిపోవాలని ఆదేశం...
సీఏఏ నిరసనల్లో పాల్గొన్న జర్మన్ విద్యార్థి వీసా కేన్సిల్...స్వదేశం వెళ్లిపోవాలని ఆదేశం...
  • Share this:
ఐఐటీ మద్రాస్ లో పీజీ చేస్తున్న జర్మన్ స్టూడెంట్ జాకబ్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొన్నందుకు… దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ లో ఫిజిక్స్ పీజీ చదువుతున్న జాకబ్.. పౌరసత్వ చట్టానికి నిరసనగా ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా చెన్నై ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నాడు. జాకబ్ ప్లకార్డును పట్టుకుని ఆందోళన చేశాడు. దీంతో అతను వీసా నిబంధనలు అతిక్రమించినట్టు అధికారులు గుర్తించారు. జాకోబ్ ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ షాక్ తో ఇండియా విడిచి వెళ్తున్నట్టు జాకోబ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. చెన్నై లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు తనను ఈ మేరకు ఆదేశించారని జాకబ్ తెలిపాడు.

First published: December 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు