Home /News /international /

GERMAN HEALTH AUTHORITIES ADVISED AGAINST THE USE OF THE MODERNA CORONAVIRUS VACCINE FOR PEOPLE UNDER 30 SSR

Under 30 Age: 30 ఏళ్ల వయసు లోపు వాళ్లు ఆ వ్యాక్సిన్ తీసుకోకండి.. జర్మనీ వైద్యాధికారుల కీలక ప్రకటన

మోడెర్నా వ్యాక్సిన్

మోడెర్నా వ్యాక్సిన్

జర్మనీలో కోవిడ్-19 మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. బుధవారం జర్మనీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కాకపోతే మరోసారి జర్మనీలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించక తప్పేలా లేదని అక్కడి ప్రముఖ వైరాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    బెర్లిన్: జర్మనీలో కోవిడ్-19 మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. బుధవారం జర్మనీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కాకపోతే మరోసారి జర్మనీలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించక తప్పేలా లేదని అక్కడి ప్రముఖ వైరాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వ్యాక్సిన్‌కు సంబంధించి జర్మనీ వైద్యఆరోగ్య అధికారులు కీలక ప్రకటన చేశారు.

    అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌ను 30 ఏళ్ల లోపు వయసు వాళ్లకు ఇస్తే హృద్రోగ సమస్యలకు దారితీసే అవకాశం స్వల్పంగా ఉందని తెలిపారు. స్టికో వ్యాక్సిన్ కమిషన్ చేసిన పరిశోధనల్లో మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిని అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసిందని తెలిపారు. 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు మోడెర్నా వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి సమస్య లేదని అధ్యయనంలో తేలింది.

    ఇది కూడా చదవండి: Pakistan Supreme Court: పెషావర్ ఆర్మీ స్కూల్ నరమేధంపై పాక్ ప్రధానిని కడిగిపారేసిన న్యాయస్థానం..

    ఫ్రాన్స్ కూడా ఇప్పటికే ఇలాంటి ప్రకటనే చేసింది. 30 ఏళ్ల లోపు యువకులు మోడెర్నా వ్యాక్సిన్ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఫ్రాన్స్ హెల్త్ అథారిటీ ఇప్పటికే ప్రకటించింది. 30 ఏళ్ల లోపు యువకులు మోడెర్నా వ్యాక్సిన్ బదులుగా ఫైజర్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఫ్రాన్స్‌తో పాటు మరో నాలుగు యూరోపియన్ దేశాలు కూడా ఇదే సూచన చేశాయి. డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్ కూడా మోడెర్నా టీకా విషయంలో ఇలాంటి సూచనే చేయడం గమనార్హం. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో జర్మనీ కూడా నిలిచింది. మోడెర్నా టీకాకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం ఇప్పటికీ ఉండటం గమనార్హం. అయితే.. అమెరికా కూడా మోడెర్నా వ్యాక్సిన్‌ యువతకు ఇచ్చే విషయంలో తాత్సారం వహిస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్‌ను ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇవ్వాలని అమెరికా గత వారమే ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా.. మోడెర్నా వ్యాక్సిన్‌ను 30 ఏళ్ల లోపు వారికి ఇవ్వకూడదని, గుండె సంబంధిత సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పిన తొలి దేశం స్వీడన్.

    ఇది కూడా చదవండి: Skull: ఇది నిజంగా మనిషి పుర్రెనే.. స్టైలిష్ కళ్లద్దాలు, నోట్లో రెండు సిగరెట్లు ఏంటనా.. మేటర్ ఏంటంటే..

    ఇక.. మోడెర్నా వ్యాక్సిన్ 30 ఏళ్ల లోపు వారు తీసుకుంటే వారు మయోకార్డిటిస్(గుండె కండరాల యొక్క ఒక తాపజనక వ్యాధి).. బారిన పడే అవకాశం స్వల్పంగా ఉందని, ఇది తీవ్రమైతే శాశ్వత గుండెపోటుకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నట్లు అధ్యయనాలు తేల్చాయి. అంతేకాదు.. మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో పెరికార్డిటిస్(గుండె వాపు) లక్షణాలు కూడా కనిపించినట్లు అధ్యయనాలు స్పష్టం చేశాయి. సీడీసీకి (సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) నివేదించిన డేటా ప్రకారం.. ఈ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం స్త్రీలతో పోల్చుకుంటే మగవారిలో ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పైగా.. 18 నుంచి 24 ఏళ్ల లోపు యువకులకే ఎక్కువ ప్రమాదమని తేలింది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న 30 ఏళ్ల లోపు యువకుల్లో కొందరిలో చాలా స్వల్పంగా ఈ లక్షణాలు కనిపించినట్లు డేటా వెల్లడించింది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోల్చుకుంటే మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మయోకార్డిటిస్, పెరికార్డిటిస్ లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనం స్పష్టం చేసింది. అయితే.. ఈ దుష్ప్రభావానికి కారణం ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కకపోవడం గమనార్హం.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Corona Vaccine, COVID-19 vaccine, Germany, International news

    తదుపరి వార్తలు