అమెరికాలో జాత్యహంకారంపై నల్లజాతీయుల పోరాటం...అల్లర్లతో అట్టుడికిన న్యూయార్క్...

George Floyd Death: జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతి యువకుడిని పోలీసు పీకపై కాలితో తొక్కి చంపేశారనే వార్తలు రావడంతో ప్రజలు ఆగ్రహంతో బయటకు వచ్చారు. వేలాది మంది నల్లజాతీయులతో పాటు మైనారిటీ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

news18-telugu
Updated: May 30, 2020, 2:41 PM IST
అమెరికాలో జాత్యహంకారంపై నల్లజాతీయుల పోరాటం...అల్లర్లతో అట్టుడికిన న్యూయార్క్...
అమెరికాలో నిరసనలు
  • Share this:
అమెరికాలోని పలు పట్టణాల్లో అల్లర్లు మిన్నంటాయి. ముఖ్యంగా మినెసొటా రాష్ట్రం మినియాపొలిస్‌, సెయింట్‌పాల్‌ నగరాల్లో ప్రారంభమైన ఈ అల్లర్లు, ప్రస్తుతం న్యూయార్క్, అట్లాంటాలకు విస్తరించాయి. అల్లర్లకు ప్రధాన కారణం విషయానికి వస్తే. జార్జి ఫ్లాయిడ్‌ (George Floyd Death) అనే నల్లజాతి యువకుడిని పోలీసు పీకపై కాలితో తొక్కి చంపేశారనే వార్తలు రావడంతో ప్రజలు ఆగ్రహంతో బయటకు వచ్చారు. వేలాది మంది నల్లజాతీయులతో పాటు మైనారిటీ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పనిలో పనిగా కొందరు ఆకతాయిలు పలు నగరాల్లో లూటీలకు పాల్పడ్డారు. దీంతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. యువకులు చేతిలో రాళ్లతోనూ, పెట్రోల్ బాంబులతో పోలీసులతో తలపడ్డారు. అయితే ఆందోళన కారులు ఓ పోలీస్‌ స్టేషన్‌కు సైతం నిప్పు పెట్టడంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పింది. ఈ సంఘటనను లైవ్‌లో ప్రసారం చేస్తున్న సీఎన్‌ఎన్‌ కెమెరామ్యాన్లతో పాటు పలువురు రిపోర్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే నల్లజాతి యువకుడు ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన పోలీసు అధికారి డెరెక్‌ చావిన్‌ కారణమని అతడిని అరెస్టు చేశారు. కాగా, కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌ విల్లీ నగరంలోనూ నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు చేశారు. వారిపై పోలీసులు రబ్బరు బుల్లెట్లతో జరిపిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఏడాది మార్చిలో బ్రెయోనా టేలర్‌(26) అనే నల్లజాతి మహిళ ఇంట్లో మాదక ద్రవ్యాల అనుమానంతో పోలీసులు చొరబడి కాల్పులు జరపగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఇంతా చేసి, ఆమె ఇంట్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకలేదు. మినియాపొలిస్‌ ప్రజల స్ఫూర్తితో లూయీస్‌విల్లీ నల్లజాతి ప్రజలు కూడా బ్రెయోనాకు న్యాయం జరగాలంటూ గురువారం వీధులకు ఎక్కారు.
First published: May 30, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading