హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

George Floyd Death: ట్రంప్‌కు ఎదురు దెబ్బ...సైన్యాన్ని దించడం కుదరదన్న రక్షణ మంత్రి...

George Floyd Death: ట్రంప్‌కు ఎదురు దెబ్బ...సైన్యాన్ని దించడం కుదరదన్న రక్షణ మంత్రి...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)

ట్రంప్ ఆదేశాలకు అడ్డుకట్ట తగిలింది. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ (Mark Esper) సైన్యాన్ని దింపే ప్రక్రియను తిరస్కరించారు. సైన్యం దించడం చివరి ఆప్షన్ అని Mark Esper స్పష్టంగా పేర్కొన్నారు.

అమెరికాలో అల్లర్లు అదుపులోకి తెచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే కరోనాతోనూ, అటు చైనాతో వాణిజ్య యుద్ధంతో సతమతం అవుతున్న అధ్యక్షుడు ట్రంప్ కు ప్రస్తుతం అల్లర్లు ఒక సవాలుగానే నిలిచాయి. అయితే జార్జ్ ఫ్లాయిడ్ (George Floyd Death) మరణం తరువాత అమెరికాలోని 140 నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిరసనకారులను 'దేశీయ ఉగ్రవాదులు' అని పిలవడంతో, మరింతగా అల్లర్లు విస్తరించాయి. దీంతో సైన్యాన్ని దించుతామని ట్రంప్ బెదిరించారు. అయితే, ఇప్పుడు ట్రంప్ ఆదేశాలకు అడ్డుకట్ట తగిలింది. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ (Mark Esper) సైన్యాన్ని దింపే ప్రక్రియను తిరస్కరించారు. సైన్యం దించడం చివరి ఆప్షన్ అని Mark Esper స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పట్లో అవసరం లేదని స్పష్టం చేశారు.

న్యూయార్క్ టైమ్స్ సమాచారం ప్రకారం, అమెరికా రక్షణ మంత్రి (Mark Esper) మార్క్ ఆస్పర్ నిరసనకారులను అణిచేందుకు సైన్యాన్ని దింపడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. వీధుల్లో ప్రదర్శనలను అణిచివేసేందుకు సైన్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను Mark Esper బేఖాతరు చేశారు. ఆస్పర్ మాట్లాడుతూ, 'శాంతిభద్రతలను కాపాడటానికి, సైన్యాన్ని ఉపయోగించరని, సైన్యాన్ని కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలన్నారు. అయితే అటు నేషనల్ గార్డ్స్ ను ఉపయోగించాలని ట్రంప్ గవర్నర్‌లపై ఒత్తిడి తెస్తున్నారు.

గత 4 రోజులలో, వాషింగ్టన్ డి.సి.లో నిరసనకారులు మరియు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది, ఇందులో ట్రంప్‌కు రక్షణగా ఉన్న సీక్రెట్ సర్వీస్ యొక్క 50 మంది ఏజెంట్లు కూడా గాయపడ్డారు. దీంతో వైట్ హౌస్ ను రక్షించే బాధ్యతను ట్రంప్ నేషనల్ గార్డ్, ఆర్మీకి అప్పగించారు. అయితే వాషింగ్టన్ పరిసరాల్లో విధుల్లో ఉన్న సైనికులను ఇంటికి పంపించాలన్న పెంటగాన్ నిర్ణయాన్ని Mark Esper మార్చేశారు. వైట్ హౌస్ భద్రత ప్రస్తుతానికి మిలిటరీతోనే ఉంటుందని ఎస్పర్ అన్నారు.

ట్రంప్ నువ్వో హిట్లర్‌వి...మాజీ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్

మరోవైపు, అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష స్థానాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇటీవలి సంఘటనలను ట్రంప్ నిర్వహించిన విధానం తనకు కోపం తెప్పించిందని ఆయన అన్నారు. డొనాల్డ్ ట్రంప్‌ను నాజీ హిట్లర్ తో పోల్చి, దేశాన్ని విభజించిన అమెరికా అధ్యక్షుడు అంటూ విమర్శించారు.

మాటిస్ మాట్లాడుతూ...'డొనాల్డ్ ట్రంప్ తన ప్రజల కోసం అమెరికా ప్రజలను బలి చేసేందుకు ప్రయత్నించిన మొదటి అధ్యక్షుడని విమర్శించారు. మరోవైపు, మాటిస్ ప్రకటనపై ట్రంప్ స్పందించి, అతన్ని అహంకార జనరల్ అని అభివర్ణించారు.

First published:

Tags: America, Donald trump, Trump

ఉత్తమ కథలు