అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై పోస్టుమార్టం నివేదిక విడుదల అయ్యింది. ఆ నివేదికలో ఫ్లాయిడ్‌ది దారుణ హత్య అని వైద్యులు తేల్చారు. మెడపై కాలు మోపి, నొక్కి పెట్టి కుదిపేసి హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్టులో రాశారు. ‘జార్జ్ ఫ్లాయిడ్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. కార్డియోపల్మోనరీ అరెస్టుకు గురయ్యాడు. అదే సమయంలో మెడ కుదుపునకు లోనైంది. అతడి మరణాన్ని నర హత్యగా పేర్కొనవచ్చు’ అని నివేదికలో వివరించారు. జార్జ్ మరణించిన విధానం చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జార్జ్ ఫ్లాయిడ్ హత్య పట్ల అమెరికా అంతటా నిరసనకారుల ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. నిరసనకారులు ఆరు రోజులుగా రాత్రి వేళల్లో తమ నిరసన వెళ్లగక్కుతున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్ హౌజ్ వద్ద కూడా వేలాది మంది నిరసన చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌజ్ సిబ్బంది.. ట్రంప్, ఆయన భార్య, కుమారుడిని బంకర్‌లోకి తరలించారు. దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, USA