• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • GAZA EXPLOSION CAPTURED ON INSTAGRAM LIVE LEAVES INTERNET SHOCKED AS PALESTINE ISRAEL ESCALATE AIRSTRIKES WATCH SU GH

Gaza Explosion live: గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. క్షిపణి పేలుడును లైవ్‌లో చూపించిన వ్యక్తి

Gaza Explosion live: గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. క్షిపణి పేలుడును లైవ్‌లో చూపించిన వ్యక్తి

(Credit: Instagram/ @mayahussein)

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా సర్దుమణగలేదు. పాలస్తీనా ఉగ్రవాదులు గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించగా, ఇజ్రాయెల్ మంగళవారం నుంచి వారిపై వైమానిక దాడులకు పాల్పడుతోంది.

  • Share this:
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా సర్దుమణగలేదు. పాలస్తీనా ఉగ్రవాదులు గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించగా, ఇజ్రాయెల్ మంగళవారం నుంచి వారిపై వైమానిక దాడులకు పాల్పడుతోంది. గత రెండు రోజులుగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అతివాద తీవ్రవాదులే లక్ష్యంగా ఆ దేశం దాడులకు పాల్పడుతుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 90 మంది వరకు పాలస్తీనా వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో 20 మంది వరకు పిల్లలు ఉండటం విషాదం. జెరూసలెంలో, వెస్ట్ బ్యాంక్ అంతటా ఇజ్రాయెల్ భద్రతా దళాలు విరుచుకు పడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పేలుళ్ల ప్రభావాన్ని చూపిస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గాజాలో ఉన్న వ్యక్తి లైవ్‌లో మాట్లాడుతుండగా వైమానిక దళాలు దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనను అతడు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ చాట్‌లో చూపించాడు.

* వీడియోలో ఏముంది?
లండన్‌కు చెందిన మాయ హుస్సేన్ అనే హాస్య నటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక లైవ్ సెషన్ నిర్వహించింది. గాజాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి అక్కడి వ్యక్తులతో చర్చించేందుకు ఈ సెషన్‌ ఏర్పాటు చేసింది. మొత్తం నలుగురు వ్యక్తులు దీంట్లో పాల్గొన్నారు. అయితే ఈ లైవ్ చాట్ కొనసాగుతుండగానే.. గాజాలో ఉన్న వ్యక్తికి సమీపంలోని ఇంటిపై ఇజ్రాయెల్ భద్రత బలగాలు ప్రయోగించిన రాకెట్‌ లాంచర్ పడింది. ఈ భారీ పేలుడును అతడు లైవ్‌లో చూపించాడు. ఈ ఘటనతో ఆ వ్యక్తి భయభ్రాంతులకు గురయ్యాడు.










View this post on Instagram






A post shared by Maya Hussein (@mayahussein)













View this post on Instagram






A post shared by Maya Hussein (@mayahussein)






అనంతరం అక్కడి పరిస్థితిని లైవ్‌లోనే వివరించాడు. “అందరూ మేల్కోండి. గాజాలో భారీ పేలుళ్లు జరుగుతున్నాయి. పాలస్తీనా ప్రజలు సురక్షితంగా లేరు. వారికి నిద్ర కూడా కరవైంది. వీరికి మీ సహాయం కావాలి. దయచేసి దీన్ని అందరితో పంచుకోండి. మనమందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది" అని అతడు వివరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

16 మంది భార్యలు, 151 మంది పిల్లలు.. మరో పెళ్లికి కూడా రెడీ.. రోజంతా అదే పనట..

Sex for Oxygen: మీ నాన్నకు ఆక్సిజన్ సిలిండర్ కావాలా.. అయితే నాతో పడుకో..

జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో ఉన్న అల్ అఖ్సా మసీదు ఈ గొడవలకు కేంద్రంగా మారింది. అనంతరం చోటు చేసుకున్న ఘర్షణలో ప్రజలు బలిపశువులు అవుతున్నారు. యూదులు, ముస్లింలు, క్రైస్తవుల పవిత్ర స్థలాలకు నిలయమైన జెరూసలెంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాల మధ్య హింస చోటుచేసుకుంటోంది. ఇరు దేశాల జాతీయ, మతపరమైన కారణాలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ బలగాల దాడులతో గాజా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. హమాస్, ఇస్లామిక్ జిహాదీలు ప్రయోగిస్తున్న రాకెట్లు, ప్రతి దాడులుగా ఇజ్రాయెల్ వైమానిక దళాలు ప్రయోగిస్తున్న క్షిపణులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Published by:Sumanth Kanukula
First published: