Kangana on Joe Biden: జో బైడెన్ ఓ గజిని, ఏడాదికి మించి బతకడు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ ఏడాదికి మించి బతకరని, ఆ తర్వాత మొత్తం షో రన్ చేసేది కమలా హారిస్ అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: November 8, 2020, 10:11 PM IST
Kangana on Joe Biden: జో బైడెన్ ఓ గజిని, ఏడాదికి మించి బతకడు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
జో బైడెన్, కమలా హారిస్
  • Share this:
అమెరికాకు కాబోయే అధ్యక్షడు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మీద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ ఏడాదికి మించి బతకరని, ఆ తర్వాత మొత్తం షో రన్ చేసేది కమలా హారిస్ అని అన్నారు. ట్విటర్ వేదికగా కంగనా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి 5 నిమిషాలకు డేటా క్రాష్ అయిపోయే గజిని జో బైడెన్. ఆయనకు ఎక్కించిన మందుల వల్ల ఏడాదికి మించి బతుకుతారని అనుకోవడం లేదు. క్లియర్‌గా కమలా హారిస్ షో రన్ చేస్తారు. ఒక మహిళ ఎదిగితే మరింత మంది మహిళలు ఎదిగేందుకు దోహదం చేస్తారు.’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.



జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడు కానున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయమైంది. 2020లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రావడానికి ముందు జో బైడెన్ ఒబామా హయాంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతేకాదు. డెలావర్‌లో అత్యంత సుదీర్ఘకాలం సేవలు అందించిన సెనేటర్‌గా కూడా 77 సంవత్సరాల బైడెన్ నిలిచారు. ‘అమెరికా. గ్రేట్ కంట్రీకి లీడర్‌గా ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు. మనముందున్న పని కష్టమైందే. కానీ, నేను ఒక్కటి మాత్ర ప్రమాణం చేస్తున్నా. నేను అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిని. మీరు నాకు ఓటు వేసినా. వేయకపోయినా. మీరు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.’ అని బైడెన్ ఓ వీడియోను ట్వీట్ చేశారు.



జో బైడెన్ అధ్యక్షుడు కావడంతో ఇక కమలా హారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. భారతీయ మూలాలున్న కమలా హారిస్ అమెరికాకు 49వ ఉపాధక్షురాలిగా ఎన్నిక కావడం లాంఛనమే. ఈ ఎన్నికల్లో గెలవడంతో ఆమె మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి ఇండియన్ అమెరికన్ ఉపాధ్యక్షురాలు, మొదటి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలు, మొదటి దక్షిణ ఆసియా అమెరికన్ మహిళా ఉపాధ్యక్షురాలు కాబోతున్నారు. కమలాహారిస్ తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 8, 2020, 10:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading