Putin: ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్నారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంతో అమెరికాతో పాటు యూరప్‌లోని అనేక కీలక దేశాలకు రష్యా ప్రధాన శత్రువుగా మారిపోయింది. అందులోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటే పలు దేశాధినేతలు రగిలిపోతున్నారు. తాజాగా జర్మనీలో చర్చలకు సిద్ధమయ్యే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)మాచో ఇమేజ్ను G7 నాయకులు ఎగతాళి చేశారు. బవేరియాలో G7 శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(Borris Johnson).. పుతిన్‌ను అపహాస్యం చేస్తూ జాకెట్లు తీసివేయాలా అని ఇతర నేతలను అడిగారు. జాకెట్స్ ఆన్? జాకెట్స్ ఆఫ్? మనం బట్టలు విప్పాలా? అని బోరిస్ జాన్సన్ కామెంట్స్ చేశారు. అయితే ఇందుకు పిక్చర్ కోసం వేచి చూద్దామని కెనడా (Canada) ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బదులిచ్చారు. జాన్సన్ వ్యాఖ్యలతో G7 సమావేశంలో నవ్వులు విరిశాయి.
పుతిన్ కంటే తమను తాము పటిష్టంగా ప్రదర్శించుకోవాలని యూకే పీఎం చమత్కరించారు. గతంలో సైబీరియన్ అడవిలో షర్ట్ లేకుండా విహారయాత్రలో పుతిన్ కనిపించిన దృశ్యాన్ని రీక్రియేట్ చేయాలని కెనడా ప్రధాన మంత్రి ట్రూడో అన్నారు. షర్ట్ లేకుండా గుర్రపు స్వారీ చేయబోతున్నామని కెనడా పీఎం జస్టిన్ ట్రూడో చెప్పారు. గుర్రపు స్వారీ ఉత్తమంగా ఉంటుందని బదులిచ్చిన యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ అన్నారు. విలేకరులు గది నుంచి బయటకు వచ్చే ముందు నాయకులు తమ కండలు చూపించాలని జాన్సన్ కామెంట్ చేశారు.
ఛాతీ కనిపిస్తూ పుతిన్ హార్స్ రైడింగ్ చేసిన దృశ్యాలు, చేపలు పడుతున్న, మంచు నిండిన నీటిలో ఈత కొడుతున్న క్రెమ్లిన్ ఫోటోషూట్లను ఉద్దేశించి G7 నాయకులు ఈ విధంగా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మధ్య పుతిన్ మాచో ఇమేజ్‌పై పాశ్చాత్య అగ్ర నాయకుల వ్యాఖ్యలు ఈ రకమైన సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే రష్యన్ బంగారం కొత్త దిగుమతులను G7 దేశాలు నిషేధించాయి. అదే సమయంలో మాస్కో నుంచి చమురు దిగుమతులపై కూడా పరిమితిని విధిస్తూ ప్రకటన చేశాయి.
పుతిన్ మాచో ఇమేజ్ను సృష్టించారా?
రష్యాను పాలించిన నాయకుల్లో ఎదురులేని నాయకుడిగా తనను తాను చూపించుకోవడానికి, మాచో ఇమేన్ను పుతిన్ సృష్టించుకున్నాడని చాలా కాలంగా విమర్శకులు ఆరోపిస్తున్నారు. 2008లో రష్యాలోని ఫార్ ఈస్ట్‌లో సైబీరియన్ పులి నుంచి ఓ టీవీ సిబ్బందిని రక్షించడం కూడా ఇందులో భాగమే అని ఆరోపించారు. పుతిన్ యుద్ధ విమానాలను ఎగురవేయడం, ధృవపు ఎలుగుబంట్లను కౌగిలించుకోవడం, తన పుట్టినరోజున హాకీ గేమ్‌లో ఒకసారి ఏడు గోల్స్ చేయడం కూడా ప్రసారమయ్యాయి. వీటన్నింటినీ పుతిన్ శారీరక పరాక్రమాన్ని చిత్రీకరించడానికి క్రెమ్లిన్ చేసిన ప్రయత్నాలుగా విమర్శకులు పేర్కొన్నారు.
తన చిన్నతనం నుంచి జూడో, సాంబో ప్రాక్టీస్ చేస్తున్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత కూడా 2022 మార్చి వరకు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్లో పుతిన్ భాగంగా ఉన్నారు. పుతిన్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రశ్నించిన చాలా మంది నేతలు, గుర్తించదగిన జూడో నైపుణ్యాలను పుతిన్ ప్రదర్శించినట్లు ఎక్కడా వీడియో ఆధారాలు లేవని ఆరోపణలు చేశారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్నారని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో పుతిన్ దీర్ఘాయువు కోసం కొమ్ముల రక్తంతో స్నానం చేస్తున్నట్లు రష్యా న్యూస్ వెబ్సైట్ Proekt పేర్కొంది. పుతిన్ ఆరోగ్యంపై పుకార్లను కొట్టివేయడానికి, అధ్యక్షుడు హాకీ ఆడుతున్నారని, మారథాన్ ప్రసంగాలు చేస్తున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.