Home /News /international /

FRENCH PRESIDENTIAL CANDIDATE VOWS HEADSCARF FINES FOR MUSLIMS PVN

Fines For Muslims : ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో అవి ధరిస్తే ఫైన్ విధిస్తామని ఎన్నికల్లో హామీ!

 ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మెరైన్ లే పెన్

ఫ్రాన్స్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మెరైన్ లే పెన్

France Elections : తాజా ఫ్రాన్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయని మెరైన్ లే పెన్ చెబుతున్నారు. మెరైన్ లే పెన్ ఓ న్యాయవాది. నేషనల్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపకుడు జీన్-మేరీ లే పెన్ కుమార్తెగా ప్రసిద్ధి చెందింది. 2011లో నేషనల్ ఫ్రంట్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించింది. అప్పటి నుంచి మెరైన్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇది మూడోసారి.

ఇంకా చదవండి ...
Headscarf Fines For Muslims : ఇటీవల కర్ణాటకలోని ఓ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే హిజాబ్ అంశం ఇప్పుడు ఫ్రాన్స్ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఫ్రాన్స్ లో ఈ త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నేతలు ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నికల ప్రచారంలో ముస్లింలు ధరించే హిజాబ్‌, పైకప్పు, బుఖాలపై పలు హామీలు గుప్పిస్తున్నారు. నేషనల్ ఫ్రంట్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మెరైన్ లే పెన్(53)..తాము అధికారంలోకి వస్తే బహిరంగ ప్రదేశాల్లో తలకు కండువాలు( Headscarves)ధరించే ముస్లింలకు జరిమానాలు విధిస్తానని ప్రమాణం చేశారు. కార్లలో సీటు బెల్ట్ ధరించే విధంగానే ఈ నిర్ణయాన్ని పోలీసులు అమలు చేసేలా చూస్తామని చెప్పారు. తన అధికారంలో కార్లలో సీటు బెల్టులు ధరించని వారి నుంచి ఎలాగైతే జరిమానా వసూలు చేస్తారో..తలకు కండువాలు ధరించే ముస్లింల నుంచి జరిమానా వసూలు చేస్తారని మెరైన్ లే పెన్ అన్నారు.

అంతేకాకుండా తాను చేపట్టే చట్టాలు వివక్షాపూరితమైనవి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఎవరైనా అంటే రాజ్యాంగపరమైన సవాళ్లను నివారించడానికి తాను ప్రజాభిప్రాయ సేకరణలు చేస్తానని మెరైన్ చెప్పారు. నిజానికి పశ్చిమ ఐరోపాలోనే ఫ్రాన్స్‌ దేశంలో ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో ముస్లింల పై వివక్ష ఎక్కువ అయింది. ప్రస్తుతం అక్కడ హిజాబ్, హెడ్‌స్కార్ఫ్ పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ భవనాల్లో ధరించడంపై నిషేధం ఉంది. పోలీసు అధికారుల వంటి రాష్ట్ర ఉద్యోగులు కూడా దానిని ధరించడం నిషేధం. ఈ నేపథ్యంలోనే మెరైన్ లే పెన్ ఇలాంటి హామీలను గుప్పించారు.

ALSO READ Sri Lanka Crisis : ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడాలంటే..అదొక్కటే దారి

మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే పరదాలు (నిఖాబ్‌లు) ధరించరాదని 2011 ఏప్రిల్ 11న ఫ్రాన్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. నిఖాబ్‌లపై నిషేధం విధించిన తొలి యూరోపియన్ దేశం ఇదే. ఫ్రాన్స్ మహిళలయినా, విదేశీయులయినా ఇల్లు దాటి బయటికొచ్చిన తరువాత నిఖాబ్ ధరించడం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు. ఆ సమయంలో నికోలాస్ సర్కోజీ ఫ్రాన్స్ అధ్యక్షులుగా ఉన్నారు. ముఖానికి పరదా కప్పుకోవడం అత్యాచారంతో సమానమని సర్కోజీ ప్రభుత్వం వెల్లడించింది. దాన్ని తమ దేశంలో స్వాగతించమని స్పష్టం చేసింది. తర్వాత అయిదేళ్లకు, 2016లో ఫ్రాన్స్‌లో మరో వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చారు. 'బుర్కిని' అని పిలిచే స్విమ్ సూట్లను నిషేధించారు. శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే స్విమ్ సూట్లివి. అయితే, ఈ చట్టం వ్యక్తుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అంటూ ఫ్రాన్స్‌ ఉన్నత న్యాయస్థానం దీన్ని రద్దు చేసింది.

ALSO READ Pak Politics : ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని పదవి నుంచి దించడంలో ఆ నలుగురిదే కీలక పాత్ర!

తాజా ఫ్రాన్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయని మెరైన్ లే పెన్ చెబుతున్నారు. మెరైన్ లే పెన్ ఓ న్యాయవాది. నేషనల్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపకుడు జీన్-మేరీ లే పెన్ కుమార్తెగా ప్రసిద్ధి చెందింది. 2011లో నేషనల్ ఫ్రంట్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించింది. అప్పటి నుంచి మెరైన్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇది మూడోసారి. 2017లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో నేషనల్ ఫ్రంట్‌ పార్టీ తన పంథా మార్చుకుంది. అన్ని వర్గాల ప్రజలు కలుపుకుపోయే విధంగా ప్రచారాలు చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ అధికారంలోకి ఉన్న మాక్రోన్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. కోవిడ్ నియంత్రణ, దేశంలో ఆరోగ్య వ్యవస్థపై భారం వంటి విషయాల్లో ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఇది ప్రతిపక్ష పార్టీ నేషనల్ ఫ్రంట్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: France, Muslim Minorities

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు