జనాభా పడిపోతోందని ఫ్రాన్స్‌లో సంచలన నిర్ణయం... పురుషులకు ఉచిత వయాగ్రా పథకం...

ఫ్రాన్స్ దేశంలో జనాభా నానాటికీ పడిపోతుంది అనేందుకు గణాంకాలు సైతం వెలువడ్డాయి. 2018 జనాభా లెక్కల ప్రకారం ఫ్రాన్స్ లోని యుక్త వయస్సులోని ఒక మహిళ కేవలం 1.06 మందికే జన్మనిస్తోంది. అంతే భారీగా ఫెర్టిలిటీ రేటు పడిపోయింది అని అర్థం. ఇది మొత్తం యూరప్ లోని అత్యల్పం కావడం విశేషం.

news18-telugu
Updated: May 21, 2019, 10:16 PM IST
జనాభా పడిపోతోందని ఫ్రాన్స్‌లో సంచలన నిర్ణయం... పురుషులకు ఉచిత వయాగ్రా పథకం...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 21, 2019, 10:16 PM IST
యూరప్ లో జనాభా నానాటికి తగ్గిపోతోంది. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో అయితే జనాభా భారీగా పడిపోతోంది. దీంతో దేశంలో వృద్ధుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. ముసలివారికి పెన్షన్లు ఇవ్వలేక అటు ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తోంది. మరోవైపు పుట్టేవారి సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో యువతరం అందుబాటులోకి రాదేమోననే ఆందోళన మొదలైంది. జనాభా ఎంతలా పడిపోతోంది అంటే..దక్షిణ ఫ్రాన్స్ లోని మాంటిరో నగరంలో కిండర్ గార్డెన్ స్కూల్స్ లో చేరేందుకు పిల్లలు లేక స్కూళ్లను మూయాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో పరిస్థితిని గమనించిన ఆ నగర మేయర్ జనాలను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు దంపతులు బిజీ లైఫ్ లో పడి లైంగిక
సుఖానికి దూరమవుతున్నారని గమనించి, పురుషులందరికీ వయాగ్రాలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించాడు. అంతేకాదు పిల్లలను లేని కపుల్స్ మరోసారి హనీమూన్ వెళ్లేందుకు ప్రత్యేక సెలవలు, అలాగే బోనస్ కూడా ఇవ్వాలని నగరంలోని కార్యాలయాలను ఆదేశించాడు.

ఫ్రాన్స్ దేశంలో జనాభా నానాటికీ పడిపోతుంది అనేందుకు గణాంకాలు సైతం వెలువడ్డాయి. 2018 జనాభా లెక్కల ప్రకారం ఫ్రాన్స్ లోని యుక్త వయస్సులోని ఒక మహిళ కేవలం 1.06 మందికే జన్మనిస్తోంది. అంతే భారీగా ఫెర్టిలిటీ రేటు పడిపోయింది అని అర్థం. ఇది మొత్తం యూరప్ లోని అత్యల్పం కావడం విశేషం. అదే సమయంలో అమెరికాలో ఫెర్టిలిటీ రేటు 1.87 కాగా, జర్మనీలో 1.46గా ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఫెర్టిలిటీ రేటు మరింత పతనం కావడంతో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా దంపతులు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాటు, పెళ్లిల్లు చేసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపడం లేదని సర్వేల్లో తేలింది.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...