బిజినెస్ ట్రిప్‌లో శృంగారం చేస్తూ మృతి.. కంపెనీ పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు

విధుల్లో భాగంగా జేవియర్ ఎక్స్ 2013లో మధ్య ఫ్రాన్స్‌కు బిజినెస్ పనిమీద వెళ్లాడు. ఓ అపరిచిత మహిళతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయాడు.

news18-telugu
Updated: September 12, 2019, 3:31 PM IST
బిజినెస్ ట్రిప్‌లో శృంగారం చేస్తూ మృతి.. కంపెనీ పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫ్రాన్స్‌‌లో ఓ కోర్టు విచిత్రమైన తీర్పు చెప్పింది. బిజినెస్ ట్రిప్‌లో ఓ అపరిచిత మహిళతో శృంగారం చేస్తూ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. జేవియర్ ఎక్స్ అనే వ్యక్తి ఫ్రాన్స్‌లోని టీఎస్ఓ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. పారిస్‌లో రైల్వే సేవలను ఆ కంపెనీ అందిస్తుంటుంది. విధుల్లో భాగంగా జేవియర్ ఎక్స్ 2013లో మధ్య ఫ్రాన్స్‌కు బిజినెస్ పనిమీద వెళ్లాడు. అక్కడ ఓ అపరిచిత మహిళను కలిశాడు. ఆమె బెడ్రూ‌మ్‌కి వెళ్లి.. ఆమెతో శృంగారంలో పాల్గొంటున్న సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయాడు. అయితే, జేవియర్ ఎక్స్ వెళ్లింది బిజినెస్ ట్రిప్ కాబట్టి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ బీమా సంస్థ.. సదరు టీఎస్‌ఓ కంపెనీని ఆదేశించింది. అయితే, తాము పంపించిన పనివేరని, అతడు చేసిన పనికి తామెందుకు పరిహారం ఇవ్వాలంటూ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత పారిస్ కోర్టు తీర్పుచెప్పింది. జేవియర్ ఎక్స్ మరణాన్ని ‘ఇండస్ట్రియల్ యాక్సిడెంట్‌’గా పరిగణించాలని స్పష్టం చేసింది. బాధితుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>