Home /News /international /

Olivier Dassault: డస్సాల్ట్ కంపెనీ ఓనర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి

Olivier Dassault: డస్సాల్ట్ కంపెనీ ఓనర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి

ఒలివియర్ డస్సాల్ట్ (File Image credit - twitter)

ఒలివియర్ డస్సాల్ట్ (File Image credit - twitter)

Olivier Dassault: ఇండియాకి రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసి ఇస్తున్నది డస్సాల్ట్ కంపెనీయే. దాని ఓనర్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం విషాదకరం.

    ప్రపంచంలోనే తిరుగులేని యుద్ధ విమానాలకు ఫేమస్ డస్సాల్ట్ కంపెనీ. అలాంటిది దాని ఓనర్ ఒలివియర్ డస్సాల్ట్ (69) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఫ్రాన్స్‌లో అత్యంత సంపన్నులలో ఒకరైన ఒలివియర్... కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ కూడా. వాయవ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ టైమ్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్‌ కుప్పకూలిందని తెలిసింది. ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో పైలెట్‌తో పాటు ఒలివియర్‌ మాత్రమే ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఒలివియర్‌తోపాటూ పైలెట్‌ కూడా చనిపోయాడు. ఒలివియర్‌ మృతిపై ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు. ఒలివియర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

    ఒలివియర్‌ తాత మార్సెల్‌ డస్సాల్ట్‌ ప్రపంచంలోనే ఫేమస్ అయిన డస్సాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీని స్థాపించారు. భారత్‌కు రాఫేల్‌ యుద్ధ విమానాల్ని ఈ సంస్థే తయారు చేసి ఇచ్చింది. ఫ్రెంచి బిలియనీర్ అయిన సెర్జి డస్సాల్ట్ పేరుమీద డస్సాల్ట్ ఏవియేషన్ పుట్టుకొచ్చింది. ఈ కంపెనీకి లి ఫిగారో న్యూస్ పేపర్ కూడా ఉంది. ఒలివెర్ డస్సాల్ట్‌కి ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన స్థానిక ఎయిర్ ఫోర్స్‌లో రిజర్వ్ కమాండర్ కూడా. తన జీవితంలో ఆయన ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉన్నారని... అధ్యక్షుడు మాక్రాన్ ట్విట్టర్‌లో తెలిపారు.


    ప్రమాదం జరిగిన నార్మండీలో ఒలివియర్‌కి ఓ హాలిడే హోమ్ ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఒలివియర్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 361వ వారుగా గుర్తింపు పొందారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఓ సోదరి ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపాదన రూ.52,372 కోట్లు. ఇందులో చాలా భాగం వారసత్వంగా వచ్చిందని 2020 ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ చెబుతోంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక డస్సాల్ట్... తన కంపెనీలో బోర్డ్ నుంచి తప్పుకున్నారు. తద్వారా ఎలాంటి మచ్చా లేకుండా చూసుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: International news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు