హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

France: 50 మందికి పైగా అల్ ఖైదా ఉగ్రవాదుల హతం.. ప్రతీకారం తీర్చుకున్న ఫ్రాన్స్

France: 50 మందికి పైగా అల్ ఖైదా ఉగ్రవాదుల హతం.. ప్రతీకారం తీర్చుకున్న ఫ్రాన్స్

ఫ్రాన్స్-ముస్లిమ్స్
మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ల ను ప్రచురించి ఉగ్రవాదుల దాడికి బలైన చార్లీ హెబ్డో పత్రిక మరోమారు తాము వివాదాస్పద కార్టూన్లను ముద్రిస్తామని పేర్కొంది. ఉగ్రదాడిని తాము మరచిపోలేదని, దీనిపై పోరాటాలు చేస్తామంటూనే మరోమారు కార్టూన్లను ప్రచురిస్తామన్న ప్రకటనతో ఫ్రాన్స్ లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. దీంతో ముస్లిం దేశాల్లో ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ఉద్యమం ప్రారంభమైంది. పాక్ తో సహా పలు ముస్లిం దేశాల్లో ఫ్రాన్స్ వ్యతిరేక ఉద్యమాలు తారాస్థాయికి చేరాయి.

ఫ్రాన్స్-ముస్లిమ్స్ మహమ్మద్ ప్రవక్తపై కార్టూన్ల ను ప్రచురించి ఉగ్రవాదుల దాడికి బలైన చార్లీ హెబ్డో పత్రిక మరోమారు తాము వివాదాస్పద కార్టూన్లను ముద్రిస్తామని పేర్కొంది. ఉగ్రదాడిని తాము మరచిపోలేదని, దీనిపై పోరాటాలు చేస్తామంటూనే మరోమారు కార్టూన్లను ప్రచురిస్తామన్న ప్రకటనతో ఫ్రాన్స్ లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. దీంతో ముస్లిం దేశాల్లో ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ఉద్యమం ప్రారంభమైంది. పాక్ తో సహా పలు ముస్లిం దేశాల్లో ఫ్రాన్స్ వ్యతిరేక ఉద్యమాలు తారాస్థాయికి చేరాయి.

ఇటీవల ఫ్రాన్స్ లో ఓ చర్చిపై జరిగిన దాడిలో ముష్కరులు కాల్పులు జరపగా.. ముగ్గురు చనిపోయిన విషయం విదితమే. దీనికి ఆ దేశ ప్రభుత్వం బదులు తీర్చుకుంది.

  • News18
  • Last Updated :

ఇటీవలే ఉగ్రవాదుల దాడికి గురైన ఫ్రాన్స్ గట్టిగా బదులు తీర్చుకుంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ... సెంట్రల్ మాలీలో ఉన్న జీహాదిస్టుల పని పట్టింది. ఆకాశం నుంచి మిసైల్స్ ను విసిరి వారిని తుదముట్టించింది. ఈ ఎయిర్ స్ట్రైక్ లలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా యాభై మందికి పైగా  ఉగ్రవాదులు చనిపోయారని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సోమవారం నాడు ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

‘గతనెల (అక్టోబర్) 30న మాలిలో ఉన్న బర్ఖేన్ ఉగ్ర శిబిరంపై ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. ఈ ఘటనలో పెద్ద ఎత్తున జీహాదిస్టులకు గాయలయ్యాయి. 50 మంది దాకా ఉగ్రవాదులు మరణించారు. వారి దగ్గర్నుంచి భారీ స్థాయిలో ఆయుధ సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి’అని ఫ్లోరెన్స్ తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు చెందిన 30 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని వివరించారు. నైజర్ లోని మాలి ప్రాంతంలో పెద్ద ఎత్తున వాహనాలు మోహరించాయని డ్రోన్లు ఇచ్చిన సమాచారంతో తాము ఎయిర్ స్ట్రైక్స్ చేశామని తెలిపారు.

అయితే మిసైల్స్ నుంచి తప్పించుకోవడానికి ఉగ్రవాదులు చెట్ల కింద దాక్కున్నారని.. వారిని డ్రోన్ల సాయంతో పట్టుకున్నామని వివరించారు. కాగా, ఇది ఇస్లామిక్ వ్యతిరేక తిరుగుబాటు ఉద్యమానికి పెద్ద అని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్ లో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడుతున్న అన్సురల్ ఇస్లాం గ్రూపు (అల్ ఖైదా అనుబంధ సంస్థ) కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంస్థతో పాటు దాని చీఫ్ గలే కు కూడా ఇది ఊహించని దెబ్బ అని చెబుతున్నారు. నైజర్ లోని పలు ప్రాంతాల్లో తిష్ట వేసుకుని ఉన్న ఉగ్రవాదులను అంతం చేయడానికి అమెరికా సాయంతో ఫ్రాన్స్ ఇప్పటికే అక్కడ భారీగా బలగాలను మోహరించిన విషయం విధితమే.

కాగా.. గతనెల 29న ఫ్రాన్స్‌లోని ఓ చర్చిలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముష్కరులు ముగ్గుర్ని అత్యంత కిరాతకంగా చంపేశారు. అత్యంత దారుణంగా ఇద్దరి తలలు నరికివేశారు. ఫ్రాన్స్‌లోని నైస్ సిటీలో ఈ ఉగ్రదాడి జరిగింది. ప్రార్థనల కోసం చర్చికి వచ్చిన ఓ పెద్ద వయసు వ్యక్తిని అత్యంత దారుణంగా ఉగ్రవాదులు చంపేశారు. నిందితుడు ‘అల్లాహో అక్బర్’ అని గట్టిగా అరిచినట్టు గుర్తించామని మేయర్ తెలిపారని బీబీసీ న్యూస్ తెలిపింది. ఈ ఘటనపై ఫ్రాన్స్ జాతీయ ఉగ్రవాద నిరోధక విభాగం హత్య కేసుగా నిర్ధారించి విచారణను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఉగ్రవాదులను ఏరివేస్తున్నట్టు పలు అంతర్జాతీయ మీడియాలు కథనాలు రాస్తున్నాయి.

First published:

Tags: France, Gun fire, Terrorists

ఉత్తమ కథలు