పాకిస్తాన్‌లో సామాజిక కార్యకర్తల మెడ మీద కత్తి... ఇదిగో సాక్ష్యం..

ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ జిబ్రాన్ నాజిర్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి.. ఆయన ఎదుట ఉన్న మైక్‌లను లాగేశారు.

news18-telugu
Updated: October 28, 2019, 6:01 PM IST
పాకిస్తాన్‌లో సామాజిక కార్యకర్తల మెడ మీద కత్తి... ఇదిగో సాక్ష్యం..
జిబ్రాన్ నాజిర్‌ మైక్‌లు తీసేస్తున్న దృశ్యం
  • Share this:
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మీడియా, సామాజిక ఉద్యమకారుల మెడ మీద కత్తిపెడుతోందంటూ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు మండిపడుతున్నారు. భావప్రకటన స్వేచ్ఛను కూడా హరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక ఉద్యమకారుల మీద పెడుతున్న ఆంక్షలకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ జిబ్రాన్ నాజిర్ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి.. ఆయన ఎదుట ఉన్న మైక్‌లను లాగేశారు. కరాచీలో జరుగుతున్న రాజకీయ ప్రేరేపిత హత్యలను హైలైట్ చేస్తూ.. జిబ్రాన్ నాజిర్ ఓ సాంస్కృతిక ప్రదర్శన చేపట్టారు. అయితే, అందుకు స్థానిక అధికారులు అనుమతిని నిరాకరించారు. అధికారుల తీరును ఖండిస్తూ జిబ్రాన్ నాజిర్.. మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ వర్గాలు తమను వేధిస్తున్నాయనే మాట చెప్పగానే.. ఓ వ్యక్తి నాజిర్‌ను అడ్డుకున్నారు. అనంతరం అన్ని మీడియా మైక్‌లను తొలగించారు. నాజిర్ చొక్కాకు ఉన్న కాలర్ మైక్‌ను కూడా తొలగించారు. ఈ విషయాన్ని జిబ్రాన్ నాజిర్ ట్వీట్ చేశారు.సామాజిక ఉద్యమకారుల మీద ప్రభుత్వం ఆంక్షలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో మరోసారి భావ ప్రకటన స్వేచ్ఛను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం హరిస్తోందంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 28, 2019, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading