Corona Test: పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయం.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

పెంపుడు జంతువులకు కరోనా టెస్టులను ఉచితంగా చేయాలని ఓ దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాలు కరోనా బారిన పడటాన్ని నగదుగా మార్చుకోవద్దని అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మూగ జీవాలకు కరోనా టెస్టులను ఉచితంగా చేస్తున్న ఆ దేశమేంటో తెలుసుకోండి మరి.

  • Share this:
    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. మరో వైపు కరోనా టెస్టుల ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులు కూడా కొన్ని చోట్ల కరోనా బారిన పడటం యజమానుల్లో ఆందోళనకు దారితీస్తోంది. భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా యజమానులు పెంపుడు జంతువులకు కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ అని వస్తే వైద్యుల సూచనల ఆధారంగా మెడిసిన్స్ అందిస్తున్నారు. అయితే పెంపుడు జంతువులకు కరోనా టెస్టులను ఉచితంగా చేయాలని ఓ దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాలు కరోనా బారిన పడటాన్ని నగదుగా మార్చుకోవద్దని అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మూగ జీవాలకు కరోనా టెస్టులను ఉచితంగా చేస్తున్న ఆ దేశమేంటో తెలుసుకోండి మరి.

    ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు, ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలకు దక్షణి కొరియా పెట్టింది పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ దేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పెంపుడు జంతువులకు కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ టెస్టుల్లో పాజిటివ్ అని వస్తే తప్పనిసరిగా ఆ పెంపుడు జంతువులను 14 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టాలని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. యజమానికి కరోనా వస్తే, పెంపుడు జంతువులకు కూడా కరోనా సోకుతున్న ఘటనలు అతి తక్కువ శాతమే ఉన్నాయి. అయినప్పటికీ కరోనా సోకిన యజమానులు.. తమ పెంపుడు జంతువులకు కూడా విధిగా టెస్టులను నిర్వహించాలని చెప్పింది.

    బుధవారం దీనికి సంబంధించిన నిర్ణయాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఓ యజమాని తన పెంపుడు కుక్కను తీసుకెళ్లి టెస్టులను నిర్వహించారు. ఆ శునకానికి జ్వరం, జలుబుగా ఉండటంతో శాంపిల్స్ ను వైద్యులు తీసుకున్నారు. సియోల్ లోని యానిమల్ శానిటేషన్ ల్యాబ్ కు ఆ శాంపిల్స్ ను పంపించారు. పెంపుడు జంతువులకు ఉచితంగా కరోనా పరీక్షలు చేయాలన్న దక్షిణ కొరియా నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: