ఉక్రెయిన్(Ukraine) దళాలకు ఫ్రాన్స్(France), ఇటలీ(Italy) యాంటీ ట్యాంక్ మిలన్ మిసైల్స్‌ను(Anti Tank Missile) అందజేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 3 మధ్య ఉక్రెయిన్‌కు చాలా డజన్ల మిలన్ మిసైల్ సిస్టమ్‌లను(Missile System) ఫ్రాన్స్, ఇటలీ తరలించినట్లు ఫ్రెంచ్ వార్తాపత్రికలు(French News Papers) పేర్కొంటున్నాయి. ఉక్రెయిన్- పోలాండ్ సరిహద్దులోని ఉక్రెయిన్ దళాలకు మిసైల్ సిస్టమ్స్ అందించారు. యాంటీ ట్యాంక్ మిలన్ మిసైల్స్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే.. మిలన్ అనేది రక్షణ సంస్థ MBDA తయారు చేసిన ఒక మ్యాన్-పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్. 1972లో మొదటిసారి ఫ్రెంచ్ సైన్యంలో మిలన్ మిసైల్ సిస్టమ్ సేవలు ప్రారంభవయ్యాయి. మిలన్ సెమీ-ఆటోమేటిక్ కమాండ్ టూ లైన్-ఆఫ్-సైట్ మిసైల్, ప్రయోగ యూనిట్ నుంచి మార్గదర్శకత్వం అవసరం. మిలన్ వెపన్ స్టేషన్లో ట్రైపాడ్, లాంచర్ స్టేషన్లో వీక్షణ వ్యవస్థ, మిసైల్ ఉంటాయి. టెయిల్-మౌంటెడ్ ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ లేదా ఎలక్ట్రానిక్ ఫ్లాష్ ల్యాంప్ ద్వారా మిసైల్‌ను ట్రాక్ చేయగలదు. మిలన్ మిసైల్‌ను రేడియో జామింగ్ లేదా మంటలు ప్రభావితం చేయలేవు.
మిలన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ ప్రయోజనాలు..
భారీ సాయుధ ట్యాంకులను లక్ష్యంగా చేసుకునే అవకాశం. కోటలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగలవు. పట్టణాలు, బహిరంగ ప్రాంతాల్లో దాడులు చేయగల సత్తా ఉంటుంది. థర్మల్ ఇమేజింగ్, డిజిటల్ ఫైరింగ్ పోస్ట్‌తో అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ ఉంది. సేకరణ, శిక్షణ, ఇతర అవసరాలకు తక్కువ మొత్తంలో ఖర్చు. అడ్వాన్స్డ్ మిలన్ మిసైల్‌లో సింగిల్ ఛార్జ్ వార్‌హెడ్.. మిశ్రమ కవచాల్లోకి చొచ్చుకుపోయే శక్తి ఉంటుంది. 1,000 మి.మీ ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్‌ను 3,000 మీటర్ల దూరంలోని లక్ష్యాలపై మిలన్ ER మిసైల్ ప్రయోగించగలదని MBDA పేర్కొంది.
మిలన్ మిసైల్ సిస్టమ్ కొత్త వెర్షన్లను ఉక్రెయిన్‌కు ఫ్రాన్స్, ఇటలీ పంపిణీ చేసినట్లు రిపోర్ట్స్‌లో వెల్లడయ్యాయి. మిలాన్-3, మిలాన్- ER ల పరిధిని 3 కి.మీలకు అప్‌గ్రేడ్ చేసే పనుల్లో ఫ్రెంచ్ సైన్యం ఉంది. మిలన్-ER, మిలన్-3ని కాల్చగల మిలన్ సిస్టమ్‌ను ఉక్రెయిన్‌కు పంపిణీ చేశారా..? లేదా..? అనేది స్పష్టంగా తెలియదు. మిలన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్ లోపాల విషయానికి వస్తే.. తక్కువ పరిధి. ఆపరేటర్ ఎక్స్పోజర్. ఓవర్‌ల్యాండ్ పవర్‌లైన్స్ ప్రమాదం. ప్రత్యేకంగా భూమిపై పోరాడే దళాల కోసం తయారైన మిలన్ ఆయుధ వ్యవస్థ కొత్త వెర్షన్.
Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు
యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడతాయి..?
రష్యా, ఉక్రెయిన్ డాన్‌బాస్‌లో ఒక ముఖ్యమైన యుద్ధానికి సిద్ధమవుతున్నాయి.. ఇక్కడ రెండు వైపులా ట్యాంకులు ఉపయోగించే అవకాశం. రెండో ప్రపంచ యుద్ధంలో కుర్స్క్ యుద్ధం తర్వాత ఐరోపాలో డాన్బాస్ వద్ద జరగనున్నది అతిపెద్ద ట్యాంక్ యుద్ధమని నిపుణులు భావిస్తున్నారు. ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటంతో పాటు ట్యాంక్ దాడులకు అనువైన భూభాగంలో యుద్ధం తదుపరి దశలో రష్యా పోరాడనుంది. ఈ పరిస్థితుల్లో మిలన్ వంటి యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉక్రెయిన్‌కు అత్యవసరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: France, Italy, Russia, Russia-Ukraine War, Ukraine