దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron variant) రూపాంతరం చెంది పలు దేశాలను కలవరపెడుతోంది. ఒమిక్రాన్ ట్రాన్స్మిసిబిలిటీని వ్యాక్సిన్‌లు ఏమాత్రం తట్టుకుంటాయో ప్రస్తుతానికైతే తెలియదు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్.. కేసులు పలు దేశాల్లోనూ గుర్తించడంతో ప్రపంచదేశాలకు వణుకు మొదలైంది. ఇదే క్రమంలో శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ (Omicron) వైరస్‌పై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ( six times higher potential to spread ) శాస్త్రవేత్తలు తెలియజేయడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒమిక్రాన్ ధాటికి ఫ్రాన్స్ చిగురుటాకులా వణికిపోతోంది. 24 గంటల్లోనే ఫ్రాన్స్‌లో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఫ్రాన్స్ (France)లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
104,611 కొత్త కేసులు..
ఫ్రాన్స్ (France)లో కరోనా వ్యాప్తి మరింత దారుణంగా ఉంది. కేవలం ఒక్క రోజే లక్ష కేసులు (One lakh cases in single day) నమోదయ్యాయి. శనివారం రోజు 104,611 కొత్త కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. గత కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 16,162 బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 3,282 మంది ఐసీయూలో ఉన్నారు. ఫ్రెంచ్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీని వెల్లడించిన వివరాల ప్రకారం.. 84 కోవిడ్-19 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 122,546కి చేరింది.
బూస్టర్ డోసు తప్పనిసరి..
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అంగీకరించిన వారినే ( if people accept the booster jab) అనుమతించాలని రెస్టారెంట్లు, కేఫ్‌లు, హోటళ్లు తదితర వాటికి ఆదేశాలు జారీ చేసింది. అలాంటి వ్యక్తుల టీకా సర్టిఫికెట్ (Vaccine Certificate) మాత్రమే చెల్లుతుందని తెలిపింది. కాగా, ఇంతకముందు రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్న మూడు నెలలకు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించినా.. దేశంలో కోవిడ్ తీవ్రత దృష్ట్యా మళ్లీ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.
భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు (omicron cases) వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లకు కూడా కొత్త మహమ్మారి వ్యాపించింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 459 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 కేసులుండగా, 44 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త ఏడాది వేడుకలను ప్రభుత్వం నిషేధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు పబ్లిక్ పేసుల్లో కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం బ్యాన్ చేసింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నది.
తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44కి చేరింది. దీంతో తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.